నేడు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్మీ అభ్యర్థులు.. అనుమతి లేదన్న కేంద్రం, పలు రాష్ట్రాల్లో హై అలర్ట్‌

Protesting Army Students Calls For Bharat Bandh Today Against Agnipath Scheme Many States Announces High Alert, Many States Announces High Alert, Protesting Army Students Calls For Bharat Bandh Today Against Agnipath Scheme, Students Calls For Bharat Bandh Today Against Agnipath Scheme, Students Calls For Bharat Bandh Today, Bharat Bandh Today Against Agnipath Scheme, Bharat Bandh Today, Protesting Army, Agnipath Protests Live Updates, Agnipath Issue,Agnipath Protests, Agnipath protests in Telangana, Agnipath Scheme, Agnipath Scheme Updates, Agnipath, Agnipath Protests Highlights, #AgnipathScheme, #AgnipathRecruitmentScheme, #AgnipathSchemeProtest, #Agnipath, Agnipath Army Recruitment Scheme News, Agnipath Army Recruitment Scheme Latest News, Agnipath Army Recruitment Scheme Latest Updates, Agnipath Army Recruitment Scheme Live Updates, Mango News, Mango News Telugu,

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ‘అగ్నిపథ్‌’ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం దీనిపై వెనుకడుగు వేసేది లేదని, ఎట్టిపరిస్థితుల్లో పథకాన్ని కొనసాగిస్తామని ప్రకటించిన నేపథ్యంలో.. ఆర్మీ అభ్యర్థులలో ఆగ్రహ జ్వాలలు మరింతగా పెల్లుబికుతున్నాయి. దీనిలో భాగంగానే నేడు దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. కొన్ని ప్రజా సంఘాలు దీనికి తమ మద్దతుని ప్రకటించాయి. అయితే బంద్‌కు అనుమతి లేదని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థలు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, కేంద్ర బలగాలు సమీక్షిస్తున్నాయి. కాగా కొన్ని రాష్ట్రాలలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా హై అలర్ట్‌ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో.. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి అల్లర్లకు తావీయకుండా ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ క్షేత్రస్థాయిలో ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక జార్ఖండ్‌లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో జార్ఖండ్‌ ప్రభుత్వం కీలక నిర‍్ణయం తీసుకుంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, పరీక్షలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక బీహార్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్‌ సర్వీసులను నిలిపివేశారు. మరోవైపు యూపీ, పంజాబ్‌లలో శాంతి భద్రతలు అదుపు తప్పకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే జైపూర్‌, నోయిడాలలో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + one =