ఇకపై తగ్గనున్న టేక్‌ హోమ్‌ శాలరీ, వచ్చే ఏప్రిల్ నుంచి అమలు?

Employees Take-home Salary May Reduce From Next Year April Due To New Rule,Take-home Salary May Reduce From April Next Year,Employees Take-home Salary May Reduce From Next Year April,Take-home Salary,Employees,Take-home Salary May Reduce From April 2021,Employees Take-Home Salary May Reduce From April Next Year,Salary,Take-home Pay,In-hand Salary,Basic Salary,Take-home Salary May Reduce,Wage Rules,New Wage Rules,Government Of India Rules,Rules On Salary,Take-home Salary Cut Employees April 2021,Mango News,Mango News Telugu,Employees Take-home Salary

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన వేతన నిబంధన వలన ఇకపై ఉద్యోగులకు వచ్చే టేక్‌ హోమ్‌ శాలరీ (చేతికొచ్చే వేతనం) కొంతమేర తగ్గనున్నట్టు తెలుస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి అనగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశముంది. వేతన నిబంధనలకు సంబంధించి కేంద్రప్రభుత్వం తాజాగా ముసాయిదా విడుదల చేసింది. ముసాయిదా ప్రకారం వేతనంలో ఇకపై అలవెన్సుల వాటా 50 శాతానికి మించకూడదు. దీంతో బేసిక్‌ శాలరీ (మూలవేతనం) 50 శాతంగా నిర్ణయించాల్సి ఉంటుంది.

అయితే ఈ నిర్ణయం వలన టేక్‌ హోమ్‌ శాలరీలో కోత పడినప్పటికీ గ్రాట్యుటీ చెల్లింపులు మరియు ప్రావిడెండ్‌ ఫండ్‌ వాటా పెరగనుందని, పదవీవిరమణ సమయంలో ఉద్యోగులకు అధిక ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. కొత్త నిబంధనలను కేంద్రం నోటిఫై చేసిన అనంతరం అందుకు అనుగుణంగా అన్ని కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో సవరణలు చేపట్టే అవకాశముంది. మరోవైపు పూర్తీ వేతనంలో బేసిక్ వేతనం కంటే అలవెన్సులు వాటా అధికంగా ఉండే ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులపై ఈ నిబంధన వలన అధిక ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =