అస్సాం రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం

Himanta Biswa Sarma Takes Oath as New Chief Minister of Assam,Mango News,Mango News Telugu,Himanta Biswa Sarma Takes Oath As The 15th Chief Minister Of Assam,Himanta Biswa Sarma,Himanta Biswa,Assam CM,Himanta Takes Oath As Assam CM,New Assam CM,15th CM Of Assam,Himanta Sarma Takes Oath,Assam CM To Take Oath,Himanta Biswa New Assam CM,Himanta Biswa Next Assam CM,Assam CM Himanta Biswa Sarma,Assam New CM,Assam Govt,Himanta Biswa Sarma Takes Oath As Assam CM,Himanta Biswa Sarma Oath,Swearing in Ceremony,Himanta Biswa Sarma Oath Ceremony,Himanta Biswa Sarma Takes Oath,Himanta Biswa Sarma Oath Ceremony Live,Himanta Biswa Sarma Latest News,Himanta Biswa Sarma Live,Himanta Biswa Sarma Live News,Himanta Biswa Sarma Live Updates,Himanta Biswa Sarma Speech

అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం ఉదయం అస్సాం గవర్నర్‌ జగదీశ్‌ ముఖీ హిమంత బిశ్వశర్మ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా, మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌, మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్‌ సంగ్మా, మణిపూర్ సీఎం ఎన్.బీరెన్ సింగ్​, నాగాలాండ్ సీఎం నేపియూ రియో, త్రిపుర సీఎం బిప్లబ్​ దేబ్​, పలువురు పార్టీ నాయకులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు హిమంత బిశ్వశర్మ డౌల్ గోవింద ఆలయం, కామాఖ్యా దేవి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇటీవల జరిగిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో 126 స్థానాలకు గానూ బీజేపీ కూటమి 75, కాంగ్రెస్ కూటమి 50, ఇతరులు 1 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కూటమికి పూర్తి మెజారిటీ దక్కడంతో ఆదివారం నాడు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై తమ శాసనసభా పక్ష నేతగా హిమంత బిశ్వశర్మను ఎన్నుకున్నారు. అనంతరం గత అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత సర్బానంద సోనోవాల్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అస్సాం 15వ ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − one =