రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర రాజకీయాలు? కేంద్ర బలగాలను సిద్ధంగా ఉంచాలన్న గవర్నర్ భగత్‌ సింగ్‌ కోష్యారీ!

Maharashtra Political Crisis Governor Koshyari Says To Centre For Adequate Central Forces be Kept Ready, Governor Koshyari Says To Centre For Adequate Central Forces be Kept Ready, Koshyari Says To Centre For Adequate Central Forces be Kept Ready, Keep Central forces ready says Governor, Adequate Central Forces be Kept Ready, Governor Koshyari, Adequate Central Forces, Maharashtra Political Crisis, Maharashtra Governor Bhagat Singh Koshyari, Governor Bhagat Singh Koshyari, Maharashtra Governor Koshyari, Maharashtra Governor, Bhagat Singh Koshyari, Maharashtra Political Crisis News, Maharashtra Political Crisis Latest News, Maharashtra Political Crisis Latest Updates, Maharashtra Political Crisis Live Updates, Mango News, Mango News Telugu,

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మరింతగా ముదురుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయం రాష్ట్రపతి పాలన దిశగా సాగుతోందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే జరిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తిరుగుబాటు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాలపై అధికార శివసేన పార్టీ శ్రేణుల దాడుల నేపథ్యంలో శాంతిభద్రతల అంశాన్ని చూపి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో తగిన కేంద్ర బలగాల ను సిద్ధం చేయండి అంటూ కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ లేఖ రాయడం సంచలనం రేపుతోంది.ఈ మేరకు గవర్నర్ కోష్యారీ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు లేఖ రాశారు.

శివసేనకు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు, ప్రహార్‌ జనశక్తి పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల నుంచి 25వ తేదీన తనకు ఒక లేఖ అందిందని, తమ కుటుంబాల భద్రత గురించి వారంతా ఆందోళన చెందుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే దీనిపై శివసేనతో పాటు ఎన్సీపీ మరియు కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. గవర్నర్‌ కేంద్రంలోని బీజేపీ పెద్దల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నారని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని మండిపడ్డారు. కాగా గత 4 రోజులుగా ఆస్పత్రిలో కరోనాకు చికిత్స పొందుతున్న గవర్నర్‌ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పాత్ర కీలకం కానుంది. ఈ క్రమంలో కొన్ని ప్లటూన్ల కేంద్ర బలగాలు నవీముంబైలోని తలోజా బేస్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారనున్నాయి. ఇప్పటికే ఒకవైపు శివసేన పార్టీలో తిరుగుబాటుపై రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతుండగా.. మరోవైపు దీనిలోకి కేంద్రం కూడా ఎంటరైతే ఏం జరుగనుందో అని అందరిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి.. చివరకు ఈ పరిణామాలు ఎటువైపుకు దారి తీస్తాయో?.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + nineteen =