అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నమూనా విడుదల

Ayodhya Ram Mandir Photos, Design of the Ram Temple in Ayodhya Released, Proposed Design of the Ram Temple in Ayodhya Released, Ram Janmbhoomi, Ram Mandir Bhoomi Pujan, Ram Mandir Photos, Ram Temple in Ayodhya Released

అయోధ్యలో నిర్మించనున్న రామమందిరం నిర్మాణానికి ఆగస్టు 5, బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా భూమి పూజ కార్యక్రమానికి 175 మంది ప్రముఖులు, 135 మంది సాధువుల సహా అయోధ్యలో మరికొందరు ప్రముఖులను మాత్రమే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం ట్రస్టు ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రామమందిరం నిర్మాణ నమూనాకు సంబంధించిన ఫోటోలను ఈ రోజు ప్రభుత్వం ప్రజలకు విడుదల చేసింది. ఇంతకు ముందు రూపకల్పన చేసిన దాని కంటే కూడా రెండింతలు పెద్దగా స్తంభాలు, గోపురాలతో 161 అడుగల ఎత్తులో మూడు అంతస్తులలో రామ మందిరాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తుంది.

సోమనాథ్‌ ఆలయాన్ని డిజైన్ చేసి, పర్యవేక్షించిన ఆర్కిటెక్ట్ ప్రభాశంకర్ సోంపురా కుమారుడు, ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపురా అయోధ్య రామ మందిరాన్ని డిజైన్ చేస్తున్నారు. రామమందిరం నమూనా, నిర్మాణ అంశాలపై 30 సంవత్సరాల క్రితమే చంద్రకాంత్ సోంపురాను సంప్రదించగా, అప్పటి నుంచే స్తంభాలు, శిల్పాల పనులు జరుగుతున్నాయి. మందిరం నిర్మాణం కోసం నగర శైలి ఆర్కిటెక్చర్ ను అనుసరించినట్టు చంద్రకాంత్ సోంపురా వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − two =