పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రాజీనామా

Amarinder Singh Resigns, Amarinder Singh resigns as Punjab chief minister, Amarinder Singh Resigns LIVE, Amarinder Singh Resigns News, Amarinder Singh steps down as Punjab CM, CM Captain Amarinder resigns, Mango News, Punjab CM Amarinder quits, Punjab CM Captain Amarinder Singh Resigns, Punjab Congress crisis, Punjab Congress Crisis LIVE Updates

గత కొన్ని రోజులుగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, నవజోత్‌ సింగ్‌ సిద్దూల మధ్య నెలకున్న విభేదాల నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ రాష్ట్ర గవర్నర్‌ భన్వరీ లాల్ పురోహిత్ ను కలిసి అమరీందర్‌ సింగ్‌ తన రాజీనామా లేఖను సమర్పించారు. కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకే అమరీందర్‌ సింగ్ రాజీనామా చేసినట్టు తెలుస్తుంది.

పంజాబ్‌ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం అమరీందర్‌ సింగ్‌, నవజోత్‌ సింగ్‌ సిద్దూల మధ్య నెలకున్న విభేదాలను తొలగించేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేదు. రెండ్రోజుల క్రితం అనేక మంది పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం అమరీందర్‌ సింగ్‌ పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ క్రమంలోనే ఏర్పడ్డ పరిస్థితులే ఆయన రాజీనామాకు దారితీసినట్టుగా తెలుస్తుంది.

మరోవైపు గవర్నర్ కు రాజీనామా సమర్పించిన అనంతరం అమరీందర్‌ సింగ్‌ మాట్లాడుతూ, ఈ విధానాన్ని అవమానంగా భావిస్తున్నానని అన్నారు. తన పనిని అనుమానిస్తున్నడంతో, రాజీనామా చేస్తానని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పాను. వారికి నమ్మకం ఉన్న ఎవరినైనా వారు నియమించవచ్చని చెప్పారు. ఇక నూతన సీఎం ఎంపిక కోసం చండీగఢ్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. పంజాబ్ ఇన్‌ఛార్జ్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ హరీష్ రావత్ ఈ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం రేసులో ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్ నవజోత్‌ సింగ్‌ సిద్దూ, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ సునీల్ జాఖర్ పేర్లు వినిపిస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + fourteen =