మ‌య‌న్మార్ పౌర నేత ఆంగ్ సాన్ సూకీకి క్షమాభిక్ష

Myanmars Ousted Leader Aung San Suu Kyi To be Pardoned by Military Junta,Myanmars Ousted Leader Aung San Suu Kyi,Ousted Leader Aung San Suu Kyi,Aung San Suu Kyi To be Pardoned by Military Junta,Myanmars Ousted Leader To be Pardoned,Aung San Suu Kyi,Amnesty for Myanmar's civilian leader,Myanmar,Myanmars Ousted Leader Latest News,Myanmars Ousted Leader Latest Updates,Myanmars Ousted Leader Live news,Leader Aung San Suu Kyi News Today,Leader Aung San Suu Kyi Latest News

మ‌య‌న్మార్ పౌర నేత ఆంగ్ సాన్ సూకీకి విముక్తి ల‌భించింది. ఆమెకు సైనిక ప్రభుత్వం క్షమాభిక్ష క‌ల్పించిన‌ట్లు తెలుస్తోంది. బుద్ధ పూర్ణిమ సంద‌ర్భంగా సైనిక ప్రభుత్వం ఈ ప్రక‌ట‌న చేసిన‌ట్లు భావిస్తున్నారు. 2021లో సూకీని సైన్యం అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. వేర్వేరు కేసుల్లో ఆమెను దోషిగా తేల్చారు. అయితే దేశ‌వ్యాప్తంగా దాదాపు ఏడువేల మంది ఖైదీల‌కు క్షమాభిక్ష క‌ల్పిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

క్షమాభిక్ష కింద ఆమెపై ఉన్న అయిదు కేసుల్ని ర‌ద్దు చేశారు. మ‌రో 14 కేసులు అలాగే ఉన్నట్లు తాజా స‌మాచారం ప్రకారం తెలుస్తోంది. రాజ‌ధాని నైపితాలో ప్రస్తుతం నోబెల్ గ్రహీత సూకీని హౌజ్ అరెస్టు చేశారు. గ‌త సోమవారం ఆమెను ప్రభుత్వ బిల్డింగ్‌కు మార్చిన‌ట్లు స్థానిక మీడియా తెలిపింది. ఏడాదిగా ఆమె క‌ఠిన జైలు జీవితాన్ని అనుభ‌వించారు. ఎన్నిక‌ల ఫ్రాడ్‌కు చెందిన కేసుల్లో ఆమె కోర్టులో పోరాడుతోంది. త‌న‌పై చేసిన అభియోగాల‌ను ఆమె ఖండించారు.

క్షమాభిక్ష క‌ల్పించినా.. ప్రస్తుతానికి సూకీని గృహ‌నిర్బంధంలోనే ఉంచ‌నున్నట్లు మ‌య‌న్మార్ రేడియో వెల్లడించింది. 78 ఏళ్ల సూకీ తొలిసారి 1989లో అరెస్టు అయ్యారు. 1991లో ఆమెకు నోబెల్ శాంతి బ‌హుమ‌తి ద‌క్కింది. 2010లో ఆమె హౌజ్ అరెస్టు నుంచి విముక్తి అయ్యారు. 2015 ఎన్నిక‌ల్లో ఆమె పార్టీ మ‌య‌న్మార్‌లో నెగ్గింది. కానీ సంస్కర‌ణ‌లను వ్యతిరేకించిన సైన్యం మ‌ళ్లీ తిరుగుబాటు చేసింది. దీంతో ఆమె మ‌ళ్లీ 2021లో నిర్బంధంలోకి వెళ్లింది. క్షమాభిక్షతో 33 ఏళ్ల జైలు శిక్షను ఆరేళ్లకు త‌గ్గించారు. మాజీ అధ్యక్షుడు విన్ మింట్‌కు కూడా జైలు శిక్షా కాలాన్ని కుదించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =