రాజ్యసభ ఎన్నికలు: 7 రాష్ట్రాల నుంచి 10 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

Rajya Sabha Elections Congress Party Releases List Of 10 Candidates, Congress Party Releases List Of 10 Candidates, INC Party Releases List Of 10 Candidates, 10 Candidates, Congress Party, INC Party, Congress's List Of 10 Candidates Out, Congress releases list of 10 candidates for RS elections, Rumblings in Congress Party after list of 10 candidates for Rajya Sabha polls released, 10 candidates for Rajya Sabha polls released, Rajya Sabha Election 2022, 2022 Rajya Sabha Election, Rajya Sabha Election, Rajya Sabha Elections News, Rajya Sabha Elections Latest News, Rajya Sabha Elections Latest Updates, Rajya Sabha Elections Live Updates, Mango News, Mango News Telugu,

దేశంలోని 15 రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ కానున్న 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఆయా రాష్ట్రాల్లో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ రాజ్యసభ ఎన్నికలకు గానూ 7 రాష్ట్రాలకు సంబంధించి 10 మంది అభ్యర్ధుల పేర్లకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం నాడు ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో పి.చిదంబరం, జైరాం రమేశ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్​ వాస్నిక్, అజయ్ మాకెన్, వివేక్ టంకా వంటి సీనియర్ నేతలు ఉన్నారు. అయితే పార్టీ కీలక నేత గులాంనబీ ఆజాద్​ కు ఈ జాబితాలో చోటుదక్కలేదు.

మరోవైపు రాజ్యసభ స్థానాలకు మే 24 నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా, నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు మే 31గా నిర్ణయించారు. జూన్ 1న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, జూన్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక ఈ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, ఓట్ల లెక్కింపు పక్రియ కూడా అదే రోజున జరుగుతుందని ఈసీ ప్రకటించింది.

కాంగ్రెస్ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థుల జాబితా ఇదే:

  1. ఛత్తీస్ గడ్ – రాజీవ్ శుక్లా
  2. ఛత్తీస్ గడ్ – రంజీత్ రంజన్
  3. హర్యాణా – అజయ్ మాకెన్
  4. కర్ణాటక – జైరాం రమేశ్​
  5. మధ్యప్రదేశ్ – వివేక్ టంకా
  6. మహారాష్ట్ర – ఇమ్రాన్ ప్రతాప్​ గర్హి
  7. రాజస్థాన్ – రణదీప్ సింగ్ సూర్జేవాలా
  8. రాజస్థాన్ – ముకుల్​ వాస్నిక్
  9. రాజస్థాన్ – ప్రమోద్ తివారీ
  10. తమిళనాడు – పి.చిదంబరం

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + 18 =