డివోర్స్ కంటే స్లీప్ డివోర్స్ బెటరంటున్న జంటలు

Sleep Divorce, Growing Sleep Divorce Culture, Sleep Divorce culture, Couples, Sleep Divorce better than Divorce, To stay together forever get a sleep divorce, Divorce, Growing Trend, Husband and Wife, Relationship, Sleep divorces are rising, Sleeping Separately, Mango News Telugu, Mango News, Latest Updates
sleep divorce culture, Couples, sleep divorce better than divorce,divorce

ఈమధ్య కలకాలం  కలిసి ఉండే  జంటల కంటే పెళ్లి అయిన ఏడాదిలోపే విడిపోతున్న కేసులను  ఎక్కువగా  చూస్తున్నాం. అయితే  ఐదేళ్లు, పదేళ్లు కలసి ఉన్నవాళ్లు  కూడా కలిసి గొడవలు పడేకంటే విడిపోయి మనస్సాంతిగా ఉందామన్నట్లుగా ఉంటున్నారు.  అందుకే కోర్టులో అన్ని కేసుల కంటే  కూడా డివోర్స్ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే తాజాగా  డీవోర్స్ కి బదులు స్లీప్ డివోర్స్ తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందట.

చాలామంది భార్యాభర్తలు  ఏదొక విషయంలో గొడవలు పడుతూనే ఉంటున్నారు. దీనికోసం ఇక విడిపోతే బాగుండు అనుకున్నవారంతా  పూర్తిగా డివోర్స్ కాకుండా స్లీప్ డివోర్స్ తీసుకుంటున్నారు. అయితే స్లీవ్ డివోర్స్ అంటే భార్యాభర్తలు పూర్తిగా విడిపోవడం కాకుండా ఒకే ఇంట్లో, ఒకే గదిలో, ఒకే మంచంపై ఉన్నా ఎలాంటి భౌతికమైన సంబంధం లేకుండా దూరంగా ఉండడమే.

అయితే డివోర్స్ కంటే కూడా ఈ స్లీప్ డివోర్స్ కొంత బెటరని అంటున్నారు. సొసైటీలో  విడాకులు తీసుకునే వారి సంఖ్య తగ్గిపోవడానికి స్లీప్ డివోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక విధంగా సమాజం కోసం, పిల్లల కోసం ,  పేరెంట్స్ కోసం కాంప్రమైజ్ అవడమే ఈ స్లీప్ డివోర్స్. గొడవలు పడి విడాకులు తీసుకోవాలనుకునే వాళ్లలో వేరువేరు గదుల్లో పడుకోవడం మాత్రమే కాదు అన్ని పనులు వేరుగానే చేసుకుంటారు. కానీ ఈ స్లీప్ డివోర్స్‌లో మాత్రం ఇద్దరూ విడివిడిగా పడుకున్నా కుటుంబ బాధ్యతలు, పిల్లల పోషణ ఇలాంటి పనులు వంటి మిగతా పనులన్నీ కలిసే చేస్తారట.

తమ జీవిత భాగస్వామి నిద్రలో దిండుని కౌగిలించుకోవడం, గురక పెట్టడం వం, రాత్రి వేళల్లో సోషల్ మీడియాను ఎక్కువగా వాడడం, నిద్రపట్టనివ్వకుండా రాత్రి పూట టీవీ చూడటం వంటి అలవాట్లు ఉంటే  నిఈ స్లీప్ డివోర్స్  తీసుకోవాలనే నిర్ణయం తీసుకుంటున్నారట.ఇలాంటి కారణాలతో  విడాకులు తీసుకుని  విడిపోవడం కన్నా స్లీప్ డివోర్స్ తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.  స్లీప్ డివోర్స్ అంటే ఒకరకంగా విడాకులు తీసుకున్నా కూడా  జీవితంలో ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా  కొన్ని గంటలు అయినా ప్రశాంతమైన నిద్రను పొందడం మాత్రమేనని నిపుణులు అంటున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =