రాముడి ప్రాణప్రతిష్ట.. భావోద్వేగానికి గురైన మోడీ

Rams Life Prestige Modi Got Emotional,Rams Life Prestige,Modi Got Emotional, PM Modi, Ram Temple, Ayodya, 22 Jan,Mango News,Mango News Telugu,Lord Ram Chose PM Modi, PM Modi To Build His Temple, PM Modis Message On Pran Pratishtha,Pran Pratishtha Of Shri Ram,Lord Ram Chose His Devotee, PM Modis Audio Message,Indian Prime Minister Narendra Modi,Narendra Modi Latest News And Updates,Ayodya Latest News,Ayodya Live Updates
PM Modi, Ram Temple, Ayodya, 22 Jan

22 జనవరి 2024.. ఎంతో ప్రధాన్యత సంతరించుకున్న రోజు.  ఈరోజు కోసం యావత్ భారత్ వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఆయోధ్య రామమందిర ప్రారంభోత్సవ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. ఈకార్యక్రమానికి ఇంకా 11 రోజుల గడువు మాత్రమే ఉంది. 15వ తేదీ నుంచే  రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనాలు ఈ మహత్కార్యానికి హాజరుకానున్నారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు 4 వేల మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

అయితే ఈ దివ్యకార్యానికి ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దేశ ప్రజలకు ప్రధాని మోడీ కీలక సందేశం ఇచ్చారు. ఓ వాయిస్ మెసేజ్‌ను విడుదల చేశారు. రామమందిర ప్రారంభోత్సవ మహత్కార్యాన్ని కనులారా వీక్షించే అవకాశం తనకు కలగడం అదృష్టమని భావిస్తున్నానని మోడీ పేర్కొన్నారు. జీవితంలో మొట్టమొదటిసారి ఇటువంటి అనుభూతులను అనుభవిస్తున్నానని చెప్పారు. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రామ భజనలు జరగాలని మోడీ పిలుపునిచ్చారు. దేశ నలుమూలలా రాములోరి నామం మారుమ్రోగిపోవాలని అన్నారు.

శ్రీరాముడి ఆదేశాల మేరకే దేశ ప్రజల ప్రతినిధిగా తాను రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనబోతున్నానని మోడీ చెప్పుకొచ్చారు. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా దేశ ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని మోడీ కోరారు.  ఈ సమయంలో… ఆలయాల్లో ప్రాణప్రతిష్ఠాపనకు ముందు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందని, అందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముందు ఉపవాసం ఉండాలని పురాణాల్లో పేర్కొన్నారని తెలిపారు. 11 రోజుల ప్రాణప్రతిష్టోత్సవాలను మహారాష్ట్ర నాసిక్‌లోని పంచవటీ నుంచి ప్రారంభించదలచుకున్నానని మోడీ వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − two =