ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో జోక్యం చేసుకోలేం.. హైకోర్టు సంచలన తీర్పు

MLC Cant Interfere In By Elections High Courts Sensational Verdict, MLC Cant Interfere In By Elections,High Courts Sensational Verdict,Telangana,MLC Elections, shock to BRS, Congress, EC,Mango News,Mango News Telugu, MLC bypolls rejected by high court, MLC By Elections,Blow to BRS as HC Dismisses,HC dismisses plea,High Court Verdict Latest News, MLC By Elections Latest Updates
Telangana, MLC Elections, shock to brs, Congress, EC

తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీకి షాక్ బిగ్ తగిలింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కొట్టిపారేసింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున స్టేషన్ ఘన్‌పూర్ నుంచి పోటీ చేసి కడియం శ్రీహరి విజయం సాధించగా.. అటు హుజురాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన పాడి కౌశిక్ రెడ్డి కూడా గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఇద్దరూ తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో తెలంగాణలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే స్థానాలు ఖాళీ అయ్యాయి. ఆ స్థానాల పదవీకాలం 30 నవంబర్ 2027 వరకు ఉంది. ఈక్రమంలో ఆయా స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఈనెల 4న షెడ్యూల్ విడుదల చేసింది.

అయితే రెండు స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికల నిర్వహించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టికల్ 171(4)కు విరుద్ధంగా ఈసీ చేసిన ఎన్నికల ప్రకటన ఉందని బీఆర్ఎస్ తరుపున న్యాయవాది ముకుల్ రోహిత్గి కోర్టుకు వివరించారు. ఎన్నికల సంఘం రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలకు నిర్వహించడం ఎన్నికల నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

అటు ఎన్నికల సంఘం తరుపున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున.. ఎన్నికల నిర్వహణలో హైకోర్టు జోక్యం ఉండదని ఆయన వాదించారు.  ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తయిన తరువాత ఏర్పడే ఖాళీలకు అధికరణ 171 కింద ఎన్నిక నిర్వహిస్తామని.. పదవీ కాలం పూర్తి కాకుండా రాజీనామాలు, ఇతర కారణాలతో ఏర్పడిన ఖాళీలకు అధికరణం 151 కింద ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ అధికరణ కిందే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈక్రమంలో ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ఆమోదయోగ్యమేనని స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం ఒకేసారి రెండు స్థానాలకు ఎన్నికల నిర్వహించాలని ఆదేశించింది. ఈ మేరకు కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను హైకోర్టు కొట్టిపారేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 18 =