రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. మంత్రివర్గంలోకి కోదండరామ్

Revanth Reddys Sensational Decision Kodandaram In The Cabinet,Revanth Reddys Sensational Decision,Kodandaram In The Cabinet,Revanth Reddy, Prof kodanda ram, Telangana Politics, MLC, Revanthe reddu cabinet,Mango News,Mango News Telugu,Key Post To Kodandaram,CM Revanth Reddy,Revanth Reddy To Award Kodandaram,Pressure on Revanth,Telangana CM Revanth Reddy,Telangana Political News And Updates
Revanth Reddy, Prof kodanda ram, Telangana Politics, MLC, Revanthe reddu cabinet

ముఖ్యమంత్రిగా నెలరోజుల పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి.. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు కదులుతున్నారు. తన నిర్ణయాలను వేలెత్తి చూపుకుండా.. విమర్శలకు తావే లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. హోం శాఖతో పాటుగా విద్యా, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి ప్రధాన శాఖలు పెండింగ్‌లో ఉన్నారు. ఈక్రమంలో లోక్ సభ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతమున్న పరిణామాల మధ్య మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం సవాల్‌తో కూడుకున్న పని. అందుకే లోక్ సభ ఎన్నికలకంటే ముందే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి.. మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. తద్వారా ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవచ్చని అనుకుంటున్నారట. ప్రస్తుతం కేబినెట్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రధాన్యత దక్కకపోవడంతో.. ఆయా జిల్లాలకు ప్రధాన్యత దక్కేలా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఈనెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కసరత్తు చేస్తున్నారు.

ఈక్రమంలోనే ప్రొఫెసర్ కొందరామ్‌ను కూడా కేబినెట్‌లోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం క్రియాశీలకంగా వ్యవహరించడంతో పాటు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు మద్ధతిచ్చారు. కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈక్రమంలో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి కోదండ రామ్‌కు ఖరారు అయింది.

దీంతో కోదండ రామ్‌ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అటు కోదండరామ్‌కు ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం వుంది. దీంతో ఆయనకు విద్యాశాఖ అప్పగించాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారట. ఆ శాఖ అప్పగించడం ద్వారా ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం ఇప్పుడు ఉపయోగపడుతుందని భావిస్తున్నారట. మరి మిగిలిన శాఖలను ఎవరికి అప్పగిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 9 =