ఏప్రిల్ మొదటివారంలోనే ఎన్నికలు

Elections Will Be Held In The First Week Of April, Elections Will Be Held, Elections Held In The First Week Of April, April First Week Elections, Kishan Reddy, Lok Sabha Elections, AP Assembly Elections, BJP, Latest AP BJP News, BJP News Updates, Modi, Andra Pradesh, Political News, Mango News, Mango News Telugu
Kishan reddy, Lok sabha elections, AP Assembly elections, BJP

ఏపీలో ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఏప్రిల్‌లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరగొచ్చని ఎన్నికల సంఘం నుంచి బలమైన సంకేతాలు అందుతున్నాయి. అటు మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని గతంలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇదే విధంగా తన అభిప్రయాన్ని వెల్లడించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని అన్నారు. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు.. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఒకే రోజున షెడ్యూల్ అవుతుందని వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి తమ హవా చాటుతుందని.. మూడోసారి మోడీ ప్రధాని అవుతారని చెప్పారు. తెలంగాణలో మెజారిటీ లోక్ సభ స్థానాలకు గెలిచి మోడీకి బహుమతిగా ఇస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.

అయితే ఎన్నికలకు మరో రెండు మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా.. కదలిరా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. అలాగే జనసేనతో సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఎంపికపై కూడా చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తున్నారు. అటు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రెండోసారి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఈసారి సిట్టింగ్‌లకు షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే నాలుగు అభ్యర్థుల జాబితాను ప్రకటించిన జగన్.. ప్రస్తుతం అయిదో జాబితాపై కసరత్తు చేస్తున్నారు.

ఇక తెలంగాణలో కూడా ప్రధాన పార్టీలన్నీ లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లోనైనా తమ హవా చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో మెజార్టీ లోక్ సభ స్థానాలపై కన్నేసింది. 12కు పైగా స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 1 =