ఆర్బీఐ కీలక ఆదేశాలు.. నేటి నుంచి మారనున్న క్రెడిట్ కార్డ్ రూల్స్

RBI Credit Card Rules To Change From Today Some Key Points To Remember, Some Key Points To Remember, RBI Credit Card Rules To Change From Today, Credit Card Rules To Change From Today, Credit card rules change from 1 July, 10 key points to remember about RBI's new rules, new credit card rules issued by the Reserve Bank of India, Credit And Debit Card Rules to Change From July 1, Debit Card Rules to Change From July 1, new credit card rules, RBI Credit Card Rules Changed News, RBI Credit Card Rules Changed Latest News, RBI Credit Card Rules Changed Latest Updates, RBI Credit Card Rules Changed Live Updates, Mango News, Mango News Telugu,

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్రెడిట్ కార్డ్ రూల్స్ సవరించింది. ఈ సవరించిన రూల్స్ నేటి (జూలై 1) నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. ఇవి షెడ్యూల్డ్ బ్యాంకులకు (చెల్లింపు బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు మరియు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు మినహా) వర్తిస్తాయి. అలాగే ఇవి క్రెడిట్, డెబిట్ మరియు కో-బ్రాండెడ్ కార్డ్‌లకు సంబంధించిన ఈ ఆదేశాలు భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి బ్యాంకుకు వర్తిస్తాయి” అని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డ్ వాడుతున్న వారు తప్పక తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు..

  • కస్టమర్ క్రెడిట్ కార్డు కోరినప్పుడు బ్యాంకులు తిరస్కరిస్తే, కార్డు తిరస్కరించడానికి గల కారణాలను రాతపూర్వకంగా కస్టమర్‌కు వెల్లడించాల్సి ఉంటుంది.
  • క్రెడిట్ కార్డ్ పోగొట్టుకున్నా, లేక మోసాలకు గురైనా ఇన్స్యూరెన్స్ కవర్ పొందే ఆప్షన్ అందించాలి.
  • కస్టమర్ల అనుమతి లేకుండా బ్యాంకులు క్రెడిట్ కార్డుల్ని అప్‌గ్రేడ్ చేయకూడదు.
  • అయాచిత కార్డ్‌లను జారీ చేయడం లేదా కార్డ్‌లను అయాచితంగా అప్‌గ్రేడ్ చేయడం వంటివి చేయరాదు.
  • ఒకవేళ అలా చేసినట్లైతే.. కార్డ్-జారీ చేసినవారు రివర్స్ ఛార్జీలతో పాటు దాని విలువ కంటే రెట్టింపు జరిమానాను కూడా చెల్లించాలి.
  • క్రెడిట్ కార్డ్-జారీ చేసేవారు ఏడు పనిదినాల్లోగా కార్డ్‌ను క్లోజ్ చేయడం కోసం కస్టమర్ల రిక్వెస్ట్‌లకు సత్వరమే స్పందించాలి.
  • దీని కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్, ఈ మెయిల్ ఐడీ, వెబ్‌సైట్, మొబైల్ యాప్స్‌లో లింక్స్ ఏర్పాటు చేయాలి.
  • సకాలంలో క్రెడిట్ కార్డుని క్లోజ్ చేయని పక్షంలో, ఖాతాలో ఎలాంటి బకాయిలు లేనట్లయితే, కార్డు మూసివేయబడే వరకు జారీచేసేవారు తప్పనిసరిగా కార్డు హోల్డర్‌కు రోజుకు రూ. 500 చొప్పున జరిమానా చెల్లించాలి.
  • బ్యాంకులు క్రెడిట్ కార్డ్‌హోల్డర్లకు ఛార్జీలు, వడ్డీ లెక్కింపుల గురించి ముందుగానే స్పష్టంగా వివరించాలి.
  • కస్టమర్ల అనుమతి లేకుండా రుణాలు లేదా ఇతర క్రెడిట్ సౌకర్యాలు కల్పించకూడదు.
  • దీనిని అతిక్రమిస్తే వాటిని వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు కొంత జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
  • ఒకవేళ కస్టమర్ డిఫాల్ట్ అయితే, దానిని గూర్చి క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీకి నివేదించే ముందు కస్టమర్లకు ఏడు రోజుల నోటీసు వ్యవధిని జారీ చేయాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 15 =