భారతదేశపు మొదటి మహిళా న్యాయవాది ఎవరో తెలుసా?

Do You Know About Cornelia Sorabji Indias First Woman Lawyer,Do You Know About Cornelia Sorabji,Cornelia Sorabji Indias First Woman Lawyer,First Woman Lawyer,About Cornelia Sorabji,Indias First Woman Lawyer,Mango News,Mango News Telugu,Indias First Lawyer,Cornelia Sorabji, a courageous woman, Indias first woman lawyer,woman lawyer,Indias First Woman Lawyer News Today,Indias First Woman Lawyer Latest News,Cornelia Sorabji Latest News,Cornelia Sorabji Latest Updates

భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా చెబుతారు. ఈ దేశంలో విభిన్న మతాలు, కులాలు, జాతుల వారు ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాలలో కుల వివక్ష, మత వివక్షలు ఎక్కువగా వినిపించడంతో.. దానిపై పోరాటం చేసే వాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. అలా సమాజంతో పోరాడుతూనూ భారతదేశపు చరిత్రలోనే తొలిసారిగా లాయర్ డిగ్రీని పొంది.. భారతదేశపు తొలి మహిళా న్యాయవాదిగా మారిన మహిళ కార్నెలియా సొరాబ్జీ.

1866 నవంబరు 15న.. నాసిక్‌లోని పార్సీ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది కార్నెలియా సొరాబ్జీ. తను ఆరుగురు సోదరీమణులలో చిన్న అమ్మాయి. కర్నాటకలోని బెల్గాంలో ఇంటి వద్దనే ఆమె విద్యను అభ్యసించారు. సొరాబ్జీ తండ్రి కర్సేద్జీ ఒక క్రైస్తవ మిషనరీ కావడం. స్త్రీ విద్యకు బలంగా మద్దతు నిచ్చేవాడు కావడంతో కుమార్తెల చదువును ప్రోత్సహించారు. బాల్యంలోని చదువు పూర్తయ్యాయ తన కుమార్తెలను బొంబాయి విశ్వవిద్యాలయంలో చేర్చించి చదివించారు.

అంతేకాదు అతని తల్లి ఫ్రాన్సినా.. పూనేలో చాలా బాలికల పాఠశాలలను స్థాపించడమే కాకుండా.. మహిళలకు విద్యను అందించడానికి అన్ని ప్రయత్నాలు చేసింది.ఇలా నాన్న, నానమ్మ ప్రోత్సాహంతో కార్నెలియా సొరాబ్జీ బొంబాయి యూనివర్శిటీకి చెందిన మొదటి విద్యార్థినిగా చేరింది. ఒక ఏడాదిలోనే ఆంగ్ల సాహిత్యంలో ఐదు సంవత్సరాల కోర్సును పూర్తి చేసి.. క్లాసులో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఇంతటి ఘనత సాధించినా కూడా స్త్రీ అనే కారణంతో.. లండన్ గాన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదవడానికి ఆమెకు స్కాలర్‌షిప్ ఇవ్వలేదు. దీంతో ఆమె తండ్రి తన స్వంత డబ్బుతో అమెను అందులో చేర్పించాడు. అయినా కూడా ఆక్స్‌ఫర్డ్ ఆమె మహిళ అనే కారణంతోనే డిగ్రీని మంజూరు చేయడానికి నిరాకరించడంతో… ఆ తర్వాత ఆమె ఇండియాకు తిరిగి వచ్చేసారు.

కార్నెలియా సొరాబ్జీ డిగ్రీ పొందలేకపోయినా.. మహిళల హక్కుల కోసం పోరాడిన వ్యక్తిగా ఎంతోమందికి స్ఫూర్తిని నింపారు. తెరవెనుక జీవించిన మహిళలను బయటకు రప్పించి సామాజిక సేవలో పాల్గొనేలా చేసారు. ఆ సమయంలో ఈ మహిళల కోసం పిటిషన్లు దాఖలు చేయడానికి సొరాబ్జీకి అనుమతి ఉన్నా కూడా.. భారతదేశంలో మహిళలు న్యాయవాద చదువును నిషేధించడం వల్ల ఆమె కోర్టులో వారి తరపున ప్రాతినిధ్యం వహించలేకపోయారు.

దీంతో సొరాబ్జీ బొంబాయి విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ చేసి.. 1899లో అలహాబాద్ హైకోర్టు న్యాయవాది పరీక్షలో పాస్ అయ్యారు. అయినా కూడా ఆమె న్యాయవాదిగా పరిగణించబడలేదు. దాంతో పరదానాశిన్ సమస్యలు, హక్కులపై గవర్నమెంటుకు న్యాయ సలహాదారుగా మాత్రమే వ్యవహరించాల్సి వచ్చింది. చివరకు 1904లో బెంగాల్ కోర్ట్ ఆఫ్ వార్డ్స్‌లో లేడీ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. అలా అప్పుడు మైనారిటీ కమ్యూనిటీలకు సహాయం చేయాలనే సొరాబ్జీ ఉత్సాహం చాలా మంది జీవితాలను తాకింది. దాదాపు రెండు దశాబ్దాలలో దాదాపు 600 మంది మహిళలతో పాటు పిల్లలకు కూడా న్యాయ పోరాటాలలో సహాయం చేసింది. అంతేకాదు బాల్య వివాహాల నిర్మూలన కోసం కూడా ఆమె పోరాడింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − eight =