రెపో రేటు, రివర్స్‌ రెపో రేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

RBI Governor, RBI Governor Announces Repo Rate And Reverse Repo Rate, RBI Governor Press Conference, RBI Governor Press Conference Updates, RBI press conference, Repo and Reverse Repo Rate, Repo and Reverse Repo Rate Unchanged, reserve bank of india, Reverse Repo Rate

దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) యొక్క ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) ఆగస్టు 6, గురువారం నాడు కీలక రెపో, రివర్స్ రెపో రేట్లపై ప్రకటన చేసింది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని కమిటీ రెపో, రివర్స్ రెపో రేట్లలో ఎలాంటి మార్పులు లేవని, యథాతథంగా కొనసాగించనున్నట్టు ప్రకటించింది. రెపో రేటు 4 శాతంగా, రివర్స్‌ రెపో రేటు 3.35 శాతంగా అమలు కానున్నట్లు తెలిపారు. అలాగే బ్యాంక్‌ రేటు, మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగా కొనసాగుతుందన్నారు. మరోసారి వడ్డీ రేట్లను తగ్గిస్తారని వ్యాపార వర్గాలు భావించాయి, అయితే యథాతథంగా కొనసాగించడానికే కమిటీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. మే 22 న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రెపోరేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించి 4.40 నుంచి 4 శాతానికి, రివర్స్ రెపోరేటు కూడా 3.35 శాతానికి తగ్గిస్తునట్టుగా ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 5 =