ఉక్రెయిన్‌లో మెడిసిన్ చేస్తున్న విద్యార్థులకు.. ఇకపై భారత్ లో చదుకునే అవకాశం?

Russia Ukraine Crisis NMC Allows Returned MBBS Students To Complete Their Internship in India, NMC Allows Returned MBBS Students To Complete Their Internship in India, Returned MBBS Students To Complete Their Internship in India, MBBS Students To Complete Their Internship in India, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, War Crisis, Ukraine News, Ukraine Crisis, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్‌లు తప్పనిసరిగా పూర్తిచేయాల్సిన 12 నెలల ఇంటర్న్‌షిప్‌ను భారతదేశంలో పూర్తి చేయడానికి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతించింది. దీనిపై NMC అధికారిక వెబ్‌సైట్ nmc.org.in లో ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. ఉక్రెయిన్ నుండి భారతీయులను తరలించడం మరియు కోవిడ్-19 మహమ్మారి వంటి పరిస్థితుల కారణంగా కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు తెలిపింది. FMGL రెగ్యులేషన్స్ మరియు 2021లో ఉన్న నిబంధనలు ప్రస్తుత పరిస్థితులకు వర్తించవని కమిషన్ స్పష్టం చేసింది. అధికారిక నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మినహాయింపు ఇవ్వనుంది.

భారతదేశంలో మిగిలిన ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయడానికి వారి దరఖాస్తు అర్హతగా పరిగణించబడుతుంది. అయితే, దీని ప్రకారం అభ్యర్థులు భారతదేశంలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేయడానికి దరఖాస్తు చేయడానికి ముందు తప్పనిసరిగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (FMGE) క్లియర్ చేసి ఉండాలి అని వెల్లడించింది. ఉక్రెయిన్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వారిని ఒకేసారి భారత వైద్య పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సిఫార్సు చేసింది.

ఉక్రెయిన్‌లో విద్యను నిలిపివేసిన విద్యార్థులను భారతీయ వైద్య కళాశాలల్లో చేర్చాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సిఫార్సు చేసింది. ప్రధాని మోదీ కి రాసిన లేఖలో.. అటువంటి విద్యార్థులను MBBS కోర్సు కోసం భారతీయ వైద్య కళాశాలలకు అనుమతించాలని ఐఎమ్ఏ పేర్కొంది. భారతదేశంలోని ఇతర వైద్య కళాశాలల్లో వారిని సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ప్రధానిని కోరింది. దీనికోసం సంబంధిత అధికారుల నుండి సర్టిఫికేట్‌ల ధ్రువీకరణ చేసిన అనంతరం ఉక్రెయిన్‌ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు భారతీయ వైద్య కళాశాలల్లో అనుమతించబడుతుందని ఐఎమ్ఏ లేఖలో పేర్కొంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + twenty =