రేపు పూణే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

PM Modi to Inaugurate Pune Metro Rail Project on March 6th, PM Modi to Inaugurate Pune Metro Rail Project, PM Modi, Narendra Modi, Prime Minister of India, Narendra Modi Prime Minister of India, Prime Minister of India to Inaugurate Pune Metro Rail Project on March 6th, Pune Metro Rail Project, Pune Metro Rail Project Latest News, Pune Metro Rail Project Latest Updates, Pune Metro Rail Project Live Updates, Metro Rail Project, PM Modi to Inaugurate Metro Rail Project In Pune, Metro Rail Project In Pune, Mango News, Mango News Telugu,

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ రేపు (మార్చి 6, ఆదివారం) పూణేలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పూణే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా ఉదయం 11 గంటలకు పూణే మున్సిపల్ కార్పోరేషన్ ప్రాంగణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. ఉదయం 11:30 గంటలకు పూణే మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

పూణేలో అర్బన్ మొబిలిటీ కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించే ప్రయత్నంలో భాగంగా మొత్తం రూ.11,400 కోట్లకు పైగా వ్యయంతో పూణే మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు డిసెంబర్ 24, 2016న ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. మొత్తం 32.2 కి.మీ పూణే మెట్రో రైలు ప్రాజెక్టులో 12 కి.మీల విస్తీర్ణాన్ని ప్రధాని రేపు ప్రారంభించనున్నారు. గార్‌వేర్ మెట్రో స్టేషన్‌ లో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి, అక్కడి నుంచి ఆనంద్‌నగర్ మెట్రో స్టేషన్ వరకు ప్రధాని మోదీ మెట్రో రైల్ లో ప్రయాణించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here