మార్చి 7 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, స్పీకర్, ప్రోటెం చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహణ

Telangana Assembly Session Starts From March 7th Speaker Held Review Meeting on Arrangements, Telangana Assembly Session Starts From March 7th, Telangana Speaker Held Review Meeting on Arrangements, Assembly Session Starts From March 7th, Telangana Assembly Session, Telangana, Assembly Session, Review Meeting on Telangana Assembly Session Arrangements, Telangana Assembly Session Latest News, Telangana Assembly Session Latest Updates, Telangana Assembly Session 2022, 2022 Telangana Assembly Session, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు మార్చి 7 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో సమావేశాల నిర్వహణపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ప్రోటెం చైర్మన్ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా.వి.నరసింహా చార్యులు, పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసుశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “ఈనెల 7వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ 8వ సెషన్ సమావేశాలు, శాసనమండలి 18వ సెషన్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. గత సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించిన అధికారులు, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల హుందాతనాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలి. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాలలో లాగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలి. గత సమావేశాలకు సంబంధించిన పెండింగులో ఉన్న ప్రశ్నలకు జవాబులను వెంటనే పంపించాలి. కరోనా ప్రభావం తగ్గినప్పటికి ఇంకా పూర్తిగా పోనందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ దరించాలి. ఎవరికైనా లక్షణాలు ఉంటే నిర్ధారణ చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ కరోనా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అత్యంత సమర్ధవంతమైనది. లోపల సభ ప్రశాంతంగా జరగాలంటే బయట శాసనసభ పరిసర ప్రాంతాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. గతంలోని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి, ఈసారి కూడా అదేవిధంగా జరగడానికి పోలీసు శాఖ తరుపున పూర్తి సహాయ, సహకారం అందించాలి” అని చెప్పారు.

ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఎంఏ అండ్ యూడీ) అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (జీఏడీ) వికాస్ రాజ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, జీహెఛ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీరవిగుప్తా, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ సి.వి ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమీషనర్ స్టిఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీసు కమీషనర్ మహేష్ భగత్, DIG ఇంటలిజెన్స్ డీఐజీ శివకుమార్, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్ కర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here