గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి క్లీన్ చిట్‌ను సమర్ధించిన సుప్రీమ్ కోర్ట్, వ్యతిరేక పిటిషన్‌ కొట్టివేత

Supreme Court Confirms Clean Chit to PM Narendra Modi in Gujarat Riots Case Rejects Zakia Jafri Plea, Supreme Court Rejects Zakia Jafri Plea, Supreme Court Confirms Clean Chit to PM Narendra Modi in Gujarat Riots Case, Gujarat Riots Case, Supreme Court Confirms Clean Chit to PM Narendra Modi, Supreme Court Confirms Clean Chit to PM Modi, Supreme Court Confirms Clean Chit to Narendra Modi, Supreme Court Confirms Clean Chit to Modi, PM Narendra Modi, Narendra Modi, Prime Minister Narendra Modi, Prime Minister Of India, Narendra Modi Prime Minister Of India, Gujarat Riots Case News, Gujarat Riots Case Latest News, Gujarat Riots Case Latest Updates, Gujarat Riots Case Live Updates, Mango News, Mango News Telugu,

2002లో గుజ‌రాత్‌లో జ‌రిగిన‌ అల్ల‌ర్ల కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సుప్రీమ్ కోర్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది. గ‌తంలోనే దీనిపై ప్రత్యేకంగా ఏర్పాటైన సిట్ తన విచారణ అనంతరం నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఇక ఇదే కేసులో సిట్ తీర్పును 2017లో గుజ‌రాత్ హైకోర్టు కూడా స‌మ‌ర్ధించడం గమనార్హం. అయితే గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో హ‌త్య‌కు గురైన కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జ‌ఫ్రీ భార్య జాకియా జ‌ఫ్రీ సిట్ ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టులో పిటిష‌న్‌ను దాఖలు చేసింది. ఈ అల్లర్లకు బాధ్యులుగా చూపిస్తూ ఆనాడు గుజ‌రాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ మరియు కొందరు రాజ‌కీయ‌నాయకులను, అధికారుల‌పై ఫిర్యాదు చేసింది.

దీనిపై విచారించిన జ‌స్టిస్ ఏఎం ఖాన్‌విల్క‌ర్‌, దినేశ్ మ‌హేశ్వ‌రి, సీటీ ర‌వికుమార్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం జాకియా జ‌ఫ్రీ పిటిష‌న్‌ను తోసిపుచ్చింది. సిట్ తీర్పును ఆమోదిస్తూ మెజిస్ట్రేట్ తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధిస్తున్నామ‌ని స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో విచార‌ణ 2021, డిసెంబ‌ర్ 8వ తేదీనే పూర్తి అయ్యింది. అయితే సుప్రీం త‌న తీర్పును ఈరోజు ప్రకటించింది. ప్రధాని మోదీతో పాటు మరో 63 మందికి క్లీన్ చిట్ ఇస్తూ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. కాగా సిట్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా, జకియా జాఫ్రీ తరపున మరో ప్రముఖ సీనియర్ కపిల్ సిబల్ వాదించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + two =