సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు రద్దు, పన్నెండో తరగతి పరీక్షలు వాయిదా

CBSE Board Class 12 exam 2021 postponed, CBSE Board Exam 2021, CBSE Board Exams, CBSE Board Exams -2021, CBSE Cancels 10th Board Exams, CBSE Class 10 exams cancelled, CBSE Class 12 board exam postponed, CBSE Class 12 board exams postponed, CBSE class 12 exams postponed, Class 10th Exams Canceled and Class 12th Exams Postponed, Class 12 exams postponed, Mango News

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) వార్షిక పరీక్షలపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేయబడ్డాయని, అలాగే 12వ తరగతి పరీక్షలు వాయిదా వేస్తునట్టుగా కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. మే 4 వ తేదీ నుండి జూన్ 14 వరకు జరగాల్సిన పదవ తరగతి బోర్డు పరీక్షలు రద్దు చేశామని చెప్పారు. బోర్డు తయారుచేయబోయే ఆబ్జెక్టివ్‌ ప్రమాణం ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తామని అన్నారు.

ఇక మే 4 నుండి జూన్ 14 వరకు జరగాల్సిన 12 వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా వేస్తున్నామని, తర్వాత ఈ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. కరోనా పరిస్థితిని జూన్ 1, 2021న బోర్డు సమీక్షిస్తుంది, ఆ తరువాత పరీక్షల నిర్వహణపై వివరాలు పంచుకోబడతాయి. పరీక్షలు ప్రారంభానికి కనీసం 15 రోజుల ముందే నోటీసు ఇవ్వబడుతుందని మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ స్పష్టం చేశారు. మరోవైపు బోర్డు నిర్ణయించిన ప్రాతిపదికన విద్యార్థులు/విద్యార్థినిలకు కేటాయించిన మార్కులతో ఎవరైనా సంతృప్తి చెందకపొతే, వారికీ పరీక్షలు నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు పరీక్ష రాసే అవకాశం ఇవ్వబడుతుందని తెలిపారు.

“పెరుగుతున్న కరోనా వ్యాప్తి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వివిధ స్థాయిలలో జరగబోయే పరీక్షలను సమీక్షించడానికి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల శ్రేయస్సు, ఆరోగ్యానికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వాలని పునరుద్ఘాటించారు. విద్యార్థుల ఉత్తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునేలా కేంద్రం చూసుకుంటుందని, అదే సమయంలో వారి విద్యా ప్రయోజనాలకు ఇబ్బంది జరగదని ప్రధాని మోదీ పేర్కొన్నారు” అని కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 12 =