టాటా గ్రూప్ చేతికి చేరిన ఎయిరిండియా

air india owner, Air India returns to Tata Group fold, Air India Sale, ceo of air india, Chairman Promises Will Make It World Class Airline, government airlines in india, Maharaja reclaims throne, Maharaja returns home, Mango News, Post Air India takeover, TATA Group Takes Over Air India, TATA Group Takes Over Air India Chairman Promises Will Make It World Class Airline, Tata Sons chief Chandrasekaran, Tata Sons chief promises a world class airline, tata sons share price

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఇక నుంచి టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లనుంది. ఎయిరిండియా ను టాటా గ్రూప్‌నకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గురువారం పూర్తి చేసింది. ఎయిరిండియా – స్పెషల్ పర్పస్ వెహికిల్ AIAHL మధ్య కుదిరిన ఒప్పందాన్ని ప్రభుత్వం నోటిఫై చేసింది. సుమారు 7 దశాబ్దాల చరిత్ర కలిగిన సుప్రసిద్ధ ‘‘మహారాజా’ను పూర్తిగా టాటా గ్రూప్ సొంతం చేసుకుంది.

దీంతో.. శుక్రవారం నుంచి ఎయిరిండియా కార్యకలాపాలు పూర్తిగా టాటా గ్రూప్ ఆధ్వర్యంలోనే జరుగనున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియా 101 డెస్టినేషన్స్‌కు విమానాలను నడుపుతున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా 57 గమ్యస్థానాలకు వైమానిక సేవలను అందిస్తోంది. అలాగే, మరో నాలుగు ఖండాల్లోని 33 దేశాలకు కూడా సేవలందిస్తోంది.

ఈరోజు (గురువారం) ఉదయం ఎయిరిండియా బోర్డు చివరి సమావేశం జరిగింది. టాటా గ్రూప్‌‌నకు ఈ సంస్థను అప్పగించేందుకు వీలుగా ఈ బోర్డు రాజీనామా చేసింది. ఎయిరిండియా అమ్మకానికి రూ.18,000 కోట్లకు టాటా గ్రూప్‌తో ప్రభుత్వం గత ఏడాది షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసింది.

టాటా గ్రూప్ రూ.2,700 కోట్లు నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించి, రూ.15,300 కోట్ల మేరకు అప్పులను స్వాధీనం చేసుకుంది. ఈ సంస్థను 1932లో టాటా గ్రూప్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా స్వాధీనంతో విమానయాన రంగంలో దాదాపు 27 శాతం మార్కెట్ వాటాను కలిగియుండే సంస్థగా టాటా గ్రూప్ మారబోతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =