నేడు దక్షిణాఫ్రికాతో చివరి టీ20 ఆడనున్న భారత్‌.. కోహ్లీ, రాహుల్‌కు విశ్రాంతి

Team India To Play 3rd T20 Against South Africa Today Virat Kohli and KL Rahul Rested For This Match, Virat Kohli and KL Rahul Rested For This Match, Team India To Play 3rd T20 Against South Africa Today, 3rd T20 Against South Africa, India VS South Africa 3rd T20, IND VS SA T20, Virat Kohli and KL Rahul, IND VS SA 3rd T20I, South Africa, IND VS SA 3rd T20I News, IND VS SA 3rd T20I Latest News And Updates, IND VS SA 3rd T20I Live Updates, Mango News, Mango News Telugu

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌ మంగళవారం చివరి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే రెండింటిని గెలుచుకుని దక్షిణాఫ్రికాపై తొలిసారి సొంతగడ్డపై సిరీస్‌ దక్కించుకున్న టీమిండియా.. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. అయితే త్వరలో జరుగనున్న టీ20 వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకుని తన రిజర్వ్ బలాన్ని పరీక్షించుకోనుంది. అందులోనూ ఇది నామమాత్రపు మ్యాచ్ కావడంతో ఈ సిరీస్‌లో టాప్ ఆర్డర్‌లో సత్తా చాటిన టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లి మరియు కేఎల్ రాహుల్‌లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. కాగా ఈనెల 6న టీ20 వరల్డ్‌ కప్‌ కోసం ఆస్ట్రేలియా బయల్దేరే భారత జట్టులో కోహ్లీ, రాహుల్‌ చేరతారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

దీంతో కోహ్లీ స్థానంలో శ్రేయాస్‌ అయ్యర్‌ తుది జట్టులోకి రానుండగా, సూర్యకుమార్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మతో కలసి ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక భారత్‌ను కలవరపెడుతున్న కీలక అంశం బౌలింగ్. బుమ్రా గైర్హాజరీలో టీమిండియా బౌలర్లు తడబడుతున్నారు. గత మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినా విజయం కోసం చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. దీంతో బౌలింగ్‌ దళాన్ని కూడా పరీక్షించనుంది. షాబాజ్‌ అహ్మద్‌, సిరాజ్‌ లేదా ఉమేశ్‌లకు తుది జట్టులో ఆడే చాన్స్‌ దక్కొచ్చు. ఇక మరోవైపు సౌతాఫ్రికా సిరీస్‌ను కోల్పోయినా చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఆ జట్టులో సీనియర్ ప్లేయర్ మిల్లర్‌ అద్భుత సెంచరీతో ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గం నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది.

జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌, శ్రేయాస్‌, రిషభ్‌ పంత్‌, కార్తీక్‌, అక్షర్‌, షాబాజ్‌, హర్షల్‌, చాహర్‌, అశ్విన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్‌), డికాక్‌, రోసౌ/హెండ్రిక్స్‌, మార్‌క్రమ్‌, మిల్లర్‌, స్టబ్స్‌, పార్నెల్‌, కేశవ్‌, రబాడ, నోకియా, ఎన్‌గిడి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =