రేపు హిమాచల్ ప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన, బిలాస్‌పూర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం

PM Narendra Modi will Visit Himachal Pradesh on 5th October Will Inaugurate AIIMS Bilaspur, PM Modi will Visit Himachal Pradesh on 5th October, PM Narendra Modi Will Inaugurate AIIMS Bilaspur, AIIMS Bilaspur, Bilaspur AIIMS, PM Narendra Modi, PM Modi Himachal Pradesh Tour, PM Modi Himachal Pradesh Visit, All India Institute of Medical Sciences, PM Modi Himachal Pradesh Tour News, PM Modi Himachal Pradesh Tour Latest News And Updates, PM Modi Himachal Pradesh Tour Live Updates, Mango News, Mango News Telugu

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబరు 5వ తేదీన హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రూ.3650 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ముందుగా బుధవారం ఉదయం 11:30 గంటలకు బిలాస్‌పూర్‌ ఎయిమ్స్ ను ప్రధాని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:45 గంటలకు బిలాస్‌పూర్‌లోని లుహ్ను గ్రౌండ్‌కు చేరుకుని అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారు, అలాగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని మోదీ మధ్యాహ్నం 3:15 గంటలకు కులులోని ధల్పూర్ మైదానానికి చేరుకుని అక్కడ కులు దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

బిలాస్‌పూర్ ఎయిమ్స్ ప్రారంభోత్సవం:

ఎయిమ్స్ బిలాస్‌పూర్ రూ.1470 కోట్ల కంటే ఎక్కువ వ్యయంతో నిర్మించబడింది. 18 స్పెషాలిటీ మరియు 17 సూపర్ స్పెషాలిటీ విభాగాలు, 18 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్‌లు, 64 ఐసీయూ పడకలతో కూడిన 750 పడకలతో అత్యాధునిక ఆసుపత్రిగా ఎయిమ్స్ బిలాస్‌పూర్ ను తీర్చిదిద్దారు. మొత్తం 247 ఎకరాలలో ఎయిమ్స్ ను నిర్మించగా, 24 గంటల అత్యవసర మరియు డయాలసిస్ సౌకర్యాలు మరియు అల్ట్రాసోనోగ్రఫీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ వంటి ఆధునిక రోగనిర్ధారణ యంత్రాలను ఏర్పాటు చేశారు. అమృత్ ఫార్మసీ మరియు జన్ ఔషధి కేంద్రం మరియు 30 పడకల ఆయుష్ బ్లాక్ కూడా ఉంది. 2017 అక్టోబర్ లో ఎయిమ్స్ బిలాస్‌పూర్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయగా, దీన్ని కేంద్రరంగ పథకం ప్రధానమంత్రి స్వాస్త్య సురక్ష యోజన కింద నిర్మించారు. ఎయిమ్స్ బిలాస్‌పూర్ ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలనే ప్రధాని మోదీ దార్శనికత మరియు నిబద్ధత మళ్లీ ప్రదర్శించబడుతోందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + twelve =