ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఏం చెప్పింది?

Tsunami Threat to India, Tsunami Threat, India Tsunami Threat, Tsunami Threat to India,ITEWC,INCOIS, Indian Tsunami Early Warning Center,Tsunami, Latest India Tsunami Threat News, India Tsunami Threat News Update, India Tsunami, India, Wheather News, Mango News, Mango News Telugu
Tsunami Threat to India,ITEWC,INCOIS,Tsunami threat to India, Indian Tsunami Early Warning Center,Tsunami

ప్రపంచవ్యాప్తంగా జనవరి 1న న్యూ ఇయర్ సంబరాలు జరుపుకొంటే..  జపాన్ మాత్రం  వరుస భూకంపాలతో వణికిపోయింది.ఏకంగా 21 సార్లు భూమి కంపించడమే కాదు.. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.5 గా నమోదైంది.  ఇషికావా ద్వీపకల్పంలో వాజిమా పోర్టులో తాజాగా దాదాపు 1.2 మీటర్ల ఎత్తులో సముద్ర అలలు ఎగసిపడగా.. మరికొన్ని చోట్ల 5 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడ్డాయి.

దీంతో హోక్కాయిడో నుండి నాగసాకి వరకు కూడా సునామీ ముప్పు ఉండే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది మే నెలలో జపాన్‌లో సుమారు రిక్టర్‌ స్కేల్‌పై 6.5 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయాన్ని గుర్తు చేశారు.  అప్పట్లో భూకంపం ధాటికి 13 మంది తీవ్రంగా గాయపడగా.. ఒకరు మృతి చెందారు. అయితే అప్పుడు కూడా భూకంప కేంద్రం ఈ ఇషికావా ప్రాంతంలో ఉందని అధికారులు చెప్పారు.

జపాన్‌లో భూకంప తీవ్రతతో ఇటు భారత్‌కు సునామీ ముప్పు ఉందేమోనని రెండురోజులుగా సోషల్ మీడియాలో నెటిజన్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే  హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌కు చెందిన ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్  దీనిపై క్లారిటీ ఇచ్చింది. భూకేంద్ర ప్రాంతానికి సమీపంలో సముద్ర మట్ట మార్పులను పర్యవేక్షించే ..ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ భారత్‌కు సునామీ ముప్పు లేదని క్లారిటీ ఇచ్చింది

మరోవైపు పసిఫిక్ మహాసముద్రం సునామీ హెచ్చరిక కేంద్రంతో పాటు జపాన్ వాతావరణ సంస్థ .. జపాన్‌కు సునామీ హెచ్చరికలను జారీ చేసింది. జపాన్‌లోని మధ్య భాగంలో సంభవించిన శక్తివంతమైన భూకంపాల వల్ల.. అనేక ప్రాంతాలకు హై అలర్ట్‌ ప్రకటించాయి. జపాన్‌ దేశంలోని పశ్చిమ తీరంలో ఇషికావా,  నీగాటా, టొయామా, యమగటా ఇతర ప్రిఫెక్చర్‌లతో పాటు కొన్ని  ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే జపాన్‌తో పాటు రష్యాకు కూడా సునామీ ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది.  అయితే ఇండియాకు మాత్రం  ఎలాంటి సునామీ ముప్పులేదని తేల్చి చెప్పింది.

2004, డిసెంబర్ 26న  భారత్‌లో సునామీ తాకింది. అప్పుడు సముద్రగర్భంలో సంభవించిన భూకంపం వల్ల  ఆ ప్రభావం 14 దేశాలపై  పడింది.  భారత్, శ్రీలంక, మాల్దీవులతో పాటు ఇతర దేశాలలో వచ్చిన సునామీ వల్ల లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తరువాతే 2007 అక్టోబర్‌లో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ .. హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్‌లో ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్‌ను  స్థాపించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − four =