నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా గోరటి వెంకన్న పోటీ..?

Gorati Venkanna Contest as MP From Nagar kurnool, MP From Nagar kurnool, Gorati Venkanna Contest as MP, Gorati Venkanna From Nagar kurnool, Goreti Venkanna, BRS, KCR, Kokhsabha Elections, MP Ticket, Latest Gorati Venkanna MP News, Latest BRS MP News, BRS MP List, Latest BRS Lok Sabha News, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Goreti venkanna, BRS, KCR, Kokhsabha Elections, MP Ticket

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్ఎస్ పార్టీ.. లోక్ సభ ఎన్నికలనైనా సత్తా చాటుకోవాలని తహతహలాడుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకొని కేంద్రంలోనైనా చక్రం తిప్పాలని చూస్తోంది. మరో మూడు, నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈక్రమంలో ఇప్పటి నుంచే బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం ఇప్పటి నుంచే అభ్యర్థులను జల్లెడ పడుతోంది. కచ్చితంగా గెలిచే అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తోంది. సామాజిక సమీకరణాలు.. స్థానిక పరిస్థితులు.. ప్రత్యర్థి పార్టీల బలాబలాలు వంటి అంశాలను పరిశీలిస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తోంది.

అయితే ఇప్పటికే బీఆర్ఎస్ తరుపున ఎంపీగా పోటీ చేయబోయే కొందరు అభ్యర్థుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కరి పేరు బలంగా వినిపిస్తోంది. ప్రముఖ గాయకుండు గోరటి వెంకన్న మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్ తరుపున ఎంపీగా పోటీ చేయనున్నారట. ప్రస్తుతం నాగర్ కర్నూల్ ఎంపీగా పోతుగంటి రాములు ఉన్నారు. అయితే జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు రాములుకు మధ్య కొంతకాలంగా విభేధాలు ఉన్నాయి. గతంలో తన కుమారుడికి జడ్పీ చైర్‌పర్సన్ పదవి దక్కకుండా కొందరు ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారని రాములు.. బీఆర్ఎస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా ఈసారి రాములుకు ఎంపీ టికెట్ ఇవ్వొద్దని మహబూబాబాద్ జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కోరుతున్నారట. ఆయనకి కాకుండా ఇంకెవరికి ఇచ్చినా సరేనని పట్టుపట్టుకొని కూర్చున్నారట. అటు పోతుగంటి రాములు కూడా ఈసారి తనకు టికెట్ రాదని ఫిక్స్ అయ్యారట. అందుకే భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారట. త్వరలో రాములు కాషాయపు తీర్థం పుచ్చుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈక్రమంలో బీఆర్ఎస్ హైకమాండ్ గోరటి వెంకన్న పేరును పరిశీలించిందట. ఆ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బీఆర్ఎస్ ఇంఛార్జ్‌లంతా కూడా గోరటి వెంకన్నవైపే మొగ్గు చూపారట. అటు మహమూబాబాద్‌కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా గోరటి వెంకన్నకు ఎంపీ టికెట్ ఇవ్వాలని పార్టీ హైకమాండ్‌కు సూచించాటర. అటు స్థానిక అంశాలపై అవగాహనతో పాటు.. ప్రజలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. అటు కాంగ్రెస్ నాగర్ కర్నూల్ నుంచి మల్లురవిని బరిలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈక్రమంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన గోరటి వెంకన్నను బరిలోకి దింపడే కరెక్ట్ అని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =