కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం

A Sensational Decision By The Congress Governament, Sensational Decision By The Congress, Congress Sensational Decision, Congress Governament Sensational Decision, Congress Governament, CM Revanth Reddy, Gruhalakshmi, Abhayahastham, Latest Congress Sensational Decision, Gruhalakshmi Latest News, Abhayahastham News, Telangana, Polictical News, Elections, Mango News, Mango News Telugu
Congress governament, CM Revanth reddy. Gruhalakshmi, Abhayahastham

సంచలన నిర్ణయాలు తీసుకుంటూ.. తన మార్క్ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా కాకముందే.. ఎన్నో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు భిన్నంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసింది.

బీఆర్ఎస్ ప్రభుత్వం తమ హయాంలో గృహ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. సొంత ఇంటి స్థలం కలిగిన పేదలు.. ఇళ్లు నిర్మించుకునేందుకు రూ. 3 లక్షల ఆర్థిక సాయం అందించేలా బీఆర్ఎస్ సర్కార్ ఆ పథకాన్ని తీసుకొచ్చింది. దాదాపు 4 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని గత బీఆర్ఎస్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈక్రమంలో తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ఆ పథకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పటికే కలెక్టర్లు జారీ చేసిన మంజూరు పత్రాలను కూడా రద్దు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గృహలక్ష్మి పథకంలో పలు అవకతవకలు ఉండటంతోనే దానిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆ పథకం స్థానంలో అభయహస్తం పేరుతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో ఒకటి అభయ హస్తం. ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా అభయహస్తం కింద పేదలు ఇళ్లు నిర్మించుకునేందుకు  రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పటికే ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలనలో ప్రజల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. అయితే ఆ దరఖాస్తులను పరిశీలించి త్వరలోనే అర్హులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం తెలిపింది. వారి సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రూ. 5 లక్షల ఆర్థికసాయం అందిస్తామని వివరించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + eleven =