ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ‘జపోరిజియా న్యూక్లియ‌ర్ ప్లాంట్‌’ స్వాధీనం చేసుకున్న‌ రష్యా

Ukraine Crisis Russian Forces Seized Huge Zaporizhzhia Nuclear Plant, Russian Forces Seized Huge Zaporizhzhia Nuclear Plant, Zaporizhzhia Nuclear Plant, Nuclear Plant, Ukraine-Russia Conflict, Ukraine-Russia Crisis, Russia Ukraine Conflict, Russia Ukraine, Russian Ukraine crisis Live, Russian Ukraine crisis, Russia-Ukraine War Live Updates, Russia Ukraine War, Ukraine conflict, Conflict in Ukraine, Russia Ukraine conflict LIVE updates, Russia Ukraine conflict News, Russia Ukraine conflicts, Russo Ukrainian War, Ukraine Russia Conflict, Ukraine Russia War, Ukraine, Russia, War Crisis, Ukraine News, Ukraine Crisis, Ukraine Updates, Ukraine Latest News, Ukraine Live Updates, russia ukraine war news, russia ukraine war status, Russia Ukraine News Live Updates, Ukraine News Updates, War in Ukraine Updates, Russia war Ukraine, ukraine news today, ukraine russia news telugu, Mango News, Mango News Telugu,

రష్యా సైనిక బలగాలు ఉక్రెయిన్ ఆగ్నేయంలో ఉన్న అతిపెద్ద ‘జపోరిజియా అణు విద్యుత్ ప్లాంట్‌’ను స్వాధీనం చేసుకున్నాయని ప్రాంతీయ రాష్ట్ర పరిపాలన శుక్రవారం తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున ప్లాంట్‌పై రష్యా బలగాలు దాడి చేశాయని చెప్పింది. ఉక్రేనియన్ సైన్యంతో సలిపిన తీవ్ర పోరాటంలో కాంప్లెక్స్‌లోని ఐదంతస్తుల భవనం దగ్ధం కావడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే, నిపుణులైన ఆపరేషనల్ సిబ్బంది పవర్ యూనిట్ల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఉక్రేనియన్ న్యూక్లియర్ ఇన్‌స్పెక్టరేట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

జపోరిజియా పవర్ స్టేషన్‌లోని రియాక్టర్లు బలమైన కంటైన్‌మెంట్ నిర్మాణాల ద్వారా రక్షించబడ్డాయి. అదేవిధంగా రియాక్టర్‌లు సురక్షితంగా మూసివేయబడుతున్నాయి అని యుఎస్ ఎనర్జీ సెక్రటరీ జెన్నిఫర్ గ్రాన్‌హోమ్ తెలిపారు. ప్లాంట్‌లోని పరిస్థితి గురించి ఉక్రెయిన్ ఇంధన మంత్రితో మాట్లాడినట్లు, ప్లాంట్‌లో రేడియేషన్ స్థాయిలు పెరిగినట్లు ఎటువంటి సూచన కనపడలేదని గ్రాన్‌హోమ్ ట్విట్టర్‌లో తెలిపారు. ప్లాంట్‌ లోపల జరిగే కార్యకలాపాలు భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రష్యన్ బలగాలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్లాంట్‌ ఉక్రెయిన్‌లోనే కాదు.. మొత్తం యూరప్ లోనే అతిపెద్ద న్యూక్లియ‌ర్ ప్లాంట్‌ కావటం విశేషం.

ఇదిలా ఉండగా.. మరోసారి చర్చల కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కోరారు. రెండవ రౌండ్ చర్చల తరువాత మానవతా కారిడార్‌లను రూపొందించడానికి కైవ్ మరియు మాస్కో తాత్కాలిక ప్రణాళికకు అంగీకరించాయి. అయితే, ఉక్రెయిన్ రాజధాని కైవ్, ఈశాన్య ఖార్కివ్ మరియు ఆగ్నేయంలోని మారియుపోల్‌తో సహా ఇతర నగరాలపై రష్యా దాడి కొనసాగుతోంది. లక్షల మంది ఉక్రెయిన్ దేశాన్ని విడిచి పొరుగు దేశాలకు వలసపోతున్నారు. మైనస్ డిగ్రీల చలిలో పసి బిడ్డలతో ఒంటరి మహిళలు కాలినడకన సరిహద్దులు దాటడం ప్రపంచ దేశాలను కలిచివేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − fourteen =