దేశంలో మహిళల భద్రతలో తెలంగాణ నంబర్ వన్ – మంత్రి సబిత ఇంద్రారెడ్డి

Telangana Accorded Top Priority For Safety and Security of Women in The State Says Minister Sabitha, Telangana Accorded Top Priority For Safety and Security of Women in The State, Telangana Accorded Top Priority For Safety and Security of Women, Minister Sabitha Says Telangana Accorded Top Priority For Safety and Security of Women in The State, Minister Sabitha, Sabitha Indra Reddy, Minister Sabitha Indra Reddy, Minister of Education of Telangana, Minister for Education of Telangana state, Telangana Minister Sabitha Indra Reddy, Top Priority For Safety and Security of Women in The Telangana State, Safety and Security of Women, Telangana, Telangana Latest News, Telangana Latest Updates, Telangana education minister, education minister, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక మహిళల భద్రతకు, అభివృద్ధికి సమ్బన్ధయించి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాల‌యంలో మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌తో క‌లిసి సబిత ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. మహిళల భద్రత విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ అని కొనియాడారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో షీ టీమ్స్, భరోసా కేంద్రాలు పెట్టి మహిళల రక్షణకు చర్యలు చేపట్టారని తెలిపారు. క‌రోనా విపత్కర స‌మ‌యంలో రాష్ట్రంలోని మ‌హిళ‌లు, గ‌ర్భిణిల‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని సబిత వెల్లడించారు.

అలాగే, కేసీఆర్ ప్రభుత్వం మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింద‌ని పేర్కొన్నారు. సహజంగా పురుషాధిక్యత కలిగిన పోలీస్ శాఖలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు క‌ల్పించిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌ సొంతమన్నారు. అలాగే, మ‌హిళలు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో నామినేటెడ్ పోస్టులను మహిళల కోసం కేటాయించి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారని స‌బితా ఇంద్రారెడ్డి గుర్తు చేశారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు జ‌ర‌పాల‌ని టీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించింద‌ని తెలిపారు. ఈ మహిళా దినోత్సవ వేడుకల్లో రాష్ట్రంలోని మహిళలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + 14 =