కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం, బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ కోసం రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీకి ఆమోదం

Union Cabinet Approves Revival Package of BSNL Amounting to Rs 1.64 Lakh Cr, Revival Package of BSNL Amounting to Rs 1.64 Lakh Cr, Cabinet approves revival package of BSNL, Bharat Sanchar Nigam Ltd revival package, revival package of Bharat Sanchar Nigam Ltd, Bharat Sanchar Nigam Ltd, Revival Package of BSNL, Union Cabinet, Union Cabinet also approved the revival package of BSNL amounting to one lakh 64 thousand crores, Union Cabinet approves revival package of BSNL worth Rs 1.64 Lakh Crore, Union Cabinet has approved 1.64 lakh crore package for revival of state-owned telecom company, state-owned telecom company, BSNL 1.64 lakh crore revival package, BSNL revival package News, BSNL revival package Latest News, BSNL revival package Latest Updates, BSNL revival package Live Updates, Mango News, Mango News Telugu,

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ఐటీ, రైల్వేలు, కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ టెలికాం బీఎస్ఎన్ఎల్ ను ఆర్థికంగా లాభదాయకంగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ 1.64 లక్షల కోట్ల రూపాయల బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. బీఎస్ఎన్ఎల్ సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి తాజా మూలధనాన్ని కేటాయించడం, స్పెక్ట్రమ్‌ను కేటాయించడం, దాని బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించడం మరియు భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్) తో విలీనం చేయడం ద్వారా దాని ఫైబర్ నెట్‌వర్క్‌ను పెంచడంపై దృష్టి సారించడం కోసం కేంద్ర కేబినెట్ ఈ పునరుద్ధరణ చర్యలను ఆమోదించింది.

ఈ చర్యలతో బీఎస్ఎన్ఎల్ కు ఇప్పటికే ఉన్న సేవల నాణ్యతను మెరుగుపరుచుకోవడంతో పాటుగా 4G సేవలను అందుబాటులోకి తీసుకురాగలదని మరియు ఆర్థికంగా నిలదొక్కుకోగలదని పేర్కొన్నారు. ఈ పునరుద్ధరణ ప్రణాళిక అమలుతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఎన్ఎల్ మలుపు తిరుగుతుందని మరియు లాభాలను ఆర్జించవచ్చని భావిస్తున్నారు. టెలికాం మార్కెట్లో బీఎస్ఎన్ఎల్ ఉనికి మార్కెట్ బ్యాలెన్సర్‌గా పనిచేస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవల విస్తరణ, స్వదేశీ సాంకేతికత అభివృద్ధి మరియు విపత్తు నివారణలో బీఎస్ఎన్ఎల్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.

అలాగే రూ. 26316 కోట్లతో అన్‌కవర్డ్ గ్రామాల్లో 4జి మొబైల్ సేవలను చేపట్టేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని 24,680 గ్రామాల్లో 4G మొబైల్ సేవలను అందించనున్నారు. ఈ ప్రాజెక్టులో 20 శాతం అదనపు గ్రామాలను చేర్చాలనే నిబంధనను కూడా చేర్చారు. వీటికి అదనంగా 2జీ/3జీ కనెక్టివిటీ ఉన్న 6,279 గ్రామాలను 4జీ కి అప్‌గ్రేడ్ చేయనున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =