‘ఆప్‌’ని వీడి బీజేపీలోకి వస్తే సీబీఐ కేసులన్నీ మూసేస్తామని ఆఫర్ ఇచ్చారు – ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా

Delhi Deputy CM Manish Sisodia Claims Message From BJP as Will Shut All Cases If Joins Their party, Manish Sisodia Refuses BJP Offer Says Will Not Bow Down Against Conspiracies, Manish Sisodia Says Will Not Bow Down Against Conspiracies, Manish Sisodia Refuses BJP Offer, Delhi Deputy Chief Minister Manish Sisodia, Manish Sisodia Says I will cut off my head but will not bow down to the corrupt and conspirators, corrupt and conspirators, Sisodia said he will never bow down, Sisodia is facing probe from the CBI in the Delhi liquor scam case, Delhi liquor scam case, Manish Sisodia, Delhi liquor scam case News, Delhi liquor scam case Latest News And Updates, Delhi liquor scam case Live Updates, Mango News, Mango News Telugu,

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానంలో అవకతవకలు జరిగాయంటూ ఇటీవల ఆయన నివాసంపై సీబీఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నివాసంలో ఎలాంటి అధారాలు దొరకకపోవడం, తదనంతరం లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో.. మనీష్‌ సిసోడియా ఈరోజు బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన దీనిపై పలు సంచలనాత్మక విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా మనీష్‌ సిసోడియా మాట్లాడుతూ.. తనకు తాజాగా బీజేపీ నుంచి ఒక మెసేజ్‌ వచ్చిందని, దాని సారాంశం ప్రకారం ‘ఆప్‌’ పార్టీని వీడి బీజేపీలోకి వస్తే ఆయనపై పెట్టిన సీబీఐ కేసులన్నీ మూసేస్తామని ఆఫర్ ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు తనకు బీజేపీ లోని కొందరు నాయకుల నుంచి ట్వీట్‌ వచ్చిందని పేర్కొన్నారు. అయితే, తాను దీనిపై ఘాటుగా రిప్లై ఇచ్చానని తెలిపారు. కేంద్రం తనపై పెట్టిన కేసులన్నీ తప్పడు కేసులని, మీరేం చేయాలకుంటే అది చేసుకోండని చెప్పానని సిసోడియా వెల్లడించారు. తాను రాజ్‌పుత్‌నని, మహారాణా ప్రతాప్‌ వంశస్థుడునని పేర్కొన్న సిసోడియా.. తలనైనా నరుక్కుంటా కానీ, మీరు చెప్పినట్లు మాత్రం చేయనని తెగేసి చెప్పానని స్పష్టం చేశారు. ఒకవైపు దేశంలో ద్రవ్యోల్బణం, ఆకాశన్నంటుతున్న ధరలతో ప్రజలు బాధపడుతుంటే.. దాని గురించి ఆలోచించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాలలోని ప్రభుత్వాలను పడగొట్టే పనులలో బిజీగా ఉందని సిసోడియా మండిపడ్డారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − one =