టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ

TDP MLA Nandamuri Balakrishna Participated in Nara Lokesh's Yuvagalam Padayatra at Anantapur District Today,TDP MLA Nandamuri Balakrishna Participated in Yuvagalam,Nara Lokesh's Yuvagalam Padayatra,Balakrishna Participated in Nara Lokesh's Yuvagalam Padayatra,Yuvagalam Padayatra at Anantapur District Today,Mango News,Mango News Telugu,Nara Lokesh's Yuvagalam Padayatra Day-63,Lokesh kickstarts Yuva Galam,TDP MLA Nandamuri Balakrishna Latest News,Nara Lokesh's Yuvagalam Padayatra News Today,Anantapur District Latest News,Anantapur District Live News

టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో యువగళం పాదయాత్ర 63వ రోజు అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. దీనికోసం ఆయన హిందూపురం నుంచి భారీ కాన్వాయ్‌తో లోకేష్ బస చేసిన శింగనమల పరిధిలోని గార్లదిన్నె మండలం మార్తాడు శివారు క్యాంప్ సైట్‌కు బాలకృష్ణ చేరుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు బాలకృష్ణ, లోకేష్ లతో కలిసి ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపించారు. పెద్ద ఎత్తున ప్రజలు, టీడీపీ మద్దతుదారులు హాజరవగా.. నారా లోకేష్ పాదయాత్ర శింగనమలలో కొనసాగుతోంది. ఇక దీనికిముందు నందమూరి బాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని, ఓటే ఆయుధమని.. అదే ప్రజలకు రక్షణ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా అభివృద్ధి అనేది లేదని, వైసీపీ ప్రభుత్వం విధానాలతో ఏపీ రాజధాని ఏది? అంటే చెప్పలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు. ఒక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారని, ఇప్పటి వరకూ నిర్మాణంలో ఒక్క అడుగు ముందుకు పడలేదని, రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని, అయితే దానితో ఏదైనా అభివృద్ధి జరిగిందా? అంతా శూన్యమేనని అన్నారు. పోనీ ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలిస్తున్నారా? అంటే అదీ లేదని, చివరకు రిటైర్డ్ అయిన వారికి కూడా సరిగా పెన్షన్లు అందించడం లేదని విమర్శించారు. ఇక సామాన్యులపై విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, పెట్రోల్, డీజిల్, ఇంటి పన్నులు, ఆఖరికి చెత్త మీద కూడా పన్నువేసే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఇదేంటని ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని, ఈసారి ఎన్నికల్లో ప్రజలు అలోచించి ఓటు వేయాలని నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =