పోలియో నేష‌న‌ల్ ఇమ్యునైజేష‌న్ డే-2022 ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌న్ సుఖ్ మాండ‌వీయ

Union Health Minister Mansukh Mandaviya Launches Polio National Immunization Day-2022, Union Health Minister Mansukh Mandaviya, Polio National Immunization Day-2022, Health Minister Mansukh Mandaviya Launches Polio National Immunization Day-2022, Union Health Minister, Mansukh Mandaviya, 2022 Polio National Immunization Day, Polio National Immunization Day, Pulse Polio, Union Minister of Health and Family Welfare Mansukh Mandaviya, Family Welfare Mansukh Mandaviya, Pulse Polio Latest News, Pulse Polio Latest Updates, Pulse Polio Live Updates, Pulse Polio 2022, 2022 Pulse Polio, Minister Mansukh Mandaviya, Mango News, Mango News Telugu,

కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ మంత్రి మ‌న్ సుఖ్ మాండ‌వీయ శనివారం ఢిల్లీలో “పోలియో నేష‌న‌ల్ ఇమ్యునైజేష‌న్ డే-2022” ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఐదేండ్ల లోపు చిన్నారుల‌కు కేంద్రమంత్రి మ‌న్ సుఖ్ మాండ‌వీయ పోలియో చుక్క‌ల‌ను వేశారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ, “5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను పోలియో నుండి రక్షించడానికి ఈ రోజు ‘పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే-2022’ ప్రారంభించబడింది. ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించాలంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి పిల్లలకు పోలియో చుక్కలు వేయించవల్సిందిగా కోరుతున్నాను” అని పేర్కొన్నారు.

ఇక ఈ ఏడాది జాతీయ పల్స్ ‌పోలియో కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 27, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 0-5 సంవత్సరాలలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇందుకోసం హెల్త్‌ సెంట‌ర్లు, అంగ‌న్ వాడీలు, ప్రభుత్వ పాఠ‌శాల‌లు, బ‌స్ స్టాండ్స్, ఎయిర్ పోర్టులు, పలు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఫిబ్రవరి 27న ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల‌ వ‌ర‌కు పల్స్​ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇక ఫిబ్రవరి 28, మార్చి 1న ఇంటింటికి తిరిగి మొదటి రోజు పోలియో చుక్కలు వేసుకోని వారిని గుర్తించి పోలియో చుక్కలు వేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 38 ల‌క్షల మందికిపైగా పిల్లల‌కు పోలియో చుక్కలు వేయాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 5 =