భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ తో దేశంలో కార్లకు స్టార్ రేటింగ్స్ : నితిన్ గడ్కరీ

Union minister Nitin Gadkari Approves Bharat NCAP Cars Gets Star Ratings Based On Performance in Crash Tests, Cars Gets Star Ratings Based On Performance in Crash Tests, Union minister Nitin Gadkari Approves Bharat NCAP, Union minister Nitin Gadkari Says Cars Gets Star Ratings Based On Performance in Crash Tests, Star Ratings Based On Performance in Crash Tests, Performance in Crash Tests, Crash Tests, Bharat NCAP, Star Ratings, Union minister Nitin Gadkari, minister Nitin Gadkari, Nitin Gadkari, Union minister, Bharat NCAP News, Bharat NCAP Latest News, Bharat NCAP Latest Updates, Bharat NCAP Live Updates, Mango News, Mango News Telugu,

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. భారత్ ఎన్సీఏపీ (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్)ని ప్రవేశపెట్టడానికి డ్రాఫ్ట్ జీఎస్ఆర్ నోటిఫికేషన్‌ను ఆమోదించినట్టు తెలిపారు. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ తో భారతదేశంలోని ఆటోమొబైల్స్/కార్లకు క్రాష్ టెస్ట్‌లలో వారి పనితీరు ఆధారంగా స్టార్ రేటింగ్స్ ఇవ్వబడతాయని పేర్కొన్నారు. “సురక్షితమైన వాహనాలను తయారు చేసేందుకు భారతదేశంలోని ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్ (ఓఈఎం)ల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తూ, తమ స్టార్-రేటింగ్‌ల ఆధారంగా సురక్షితమైన కార్లను ఎంచుకోవడానికి వినియోగదారులను అనుమతించే వినియోగదారుల-కేంద్రీకృత ప్లాట్‌ఫారమ్‌గా భారత్-ఎన్సీఏపీ పనిచేస్తుంది” అని నితిన్ గడ్కరీ తెలిపారు.

కార్లలో నిర్మాణ మరియు ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి మాత్రమే కాకుండా, భారతీయ ఆటోమొబైల్స్ ఎగుమతి-యోగ్యతను పెంచడానికి కూడా క్రాష్ టెస్ట్‌ల ఆధారంగా భారతీయ కార్లకు స్టార్ రేటింగ్ చాలా కీలకమని మంత్రి అన్నారు. భారత్ ఎన్సీఏపీ యొక్క టెస్టింగ్ ప్రోటోకాల్ ప్రస్తుతం ఉన్న భారతీయ నిబంధనలలో గ్లోబల్ క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్‌ల ఫ్యాక్టరింగ్‌తో సమం చేయబడుతుందని, ఓఈఎంలు తమ వాహనాలను భారతదేశం యొక్క ఇన్ హోస్ పరీక్షా సౌకర్యాలలో పరీక్షించుకోవడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 ఆటోమొబైల్ హబ్‌గా మార్చే లక్ష్యంతో, దేశ ఆటోమొబైల్ పరిశ్రమను ఆత్మనిర్భర్‌గా మార్చడంలో భారత్ ఎన్సీఏపీ కీలకమైన సాధనంగా నిరూపిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − seven =