అమెరికా అధ్యక్ష ఎన్నికలు: డోనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య వాడివేడిగా డిబేట్

2020 United States presidential election, Biden vs Trump, Trump and Joe Biden Attended for First Presidential Debate, US election 2020, US Election 2020 Live News updates, US election 2020 polls, US Elections 2020 News, US Elections-2020, US presidential election 2020 poll

అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3, 2020 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు అధ్యక్ష పదవికి బరిలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య తోలి డిబేట్(చర్చ్) జరిగింది. ఈ చర్చ ఆసాంతం వాడివేడిగా జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక, ఒబామా కేర్ పాలసీ, కరోనాపై తీసుకున్న చర్యలకు సంబంధించి పలు ప్రశ్నలను బిడెన్ ట్రంప్ పై సంధించారు. సుప్రీంకోర్టు నియామకాల్లో తమకు పూర్తి స్వేచ్ఛ ఉందని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే ఒబామా కేర్‌ను రద్దు చేసినా ప్రజలకు మంచి వైద్యమందిస్తునట్టు తెలిపారు. కరోనాపై చర్యలపై ట్రంప్ మాట్లాడుతూ కరోనా సోకినా ప్రజలకు మెరుగైన వైద్యం అందించామని పేర్కొన్నారు.

కరోనాపై చర్చ సందర్భంగా భారత్ సహా ఇతర దేశాల ప్రస్తావనను ట్రంప్ తీసుకొచ్చారు. ‌అమెరికాలో కరోనా మరణాల సంఖ్య తక్కువేనని పేర్కొంటూ, చైనా, రష్యా, భారత్‌ వంటి దేశాల్లో ఎంతమంది కరోనా వలన మరణించారనే వివరాలు మీకు తెలియదు. ఆ దేశాలు కరోనా మరణాలపై కచ్చితమైన గణాంకాలను వెల్లడించడం లేదని అన్నారు. తమ ప్రభుత్వం కరోనా విషయంలో సరైన చర్యలు తీసుకోకపోయుంటే ఇప్పటికే అనేక మిలియన్ల మంది మరణించి ఉండేవారని ట్రంప్ అన్నారు. ఈ డిబేట్ సందర్భంగా ట్రంప్, బిడెన్ సహనం కోల్పోయి విమర్శలు కూడా చేసుకున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన డిబేట్ ను అమెరికా ప్రజలతో పాటుగా ఇతర దేశాలు సైతం ఎంతో ఆసక్తితో తిలకించాయి. ఎన్నికలకు నెలరోజులు మాత్రమే ఉండడంతో తదుపరి అధక్షుడు ఎన్నికపై అమెరికాలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − four =