రూ.10 నుంచి రూ.35 దాకా రైలు ప్రయాణికులకు యూజర్‌ ఛార్జీలు?

Indian Railways, indian railways charges, Indian Railways May Charge upto Rs 35 User Charges, Indian Railways News, indian railways trains, Indian Railways Updates, Railway User Charges, Railways may charge Rs 10-Rs 35 user fees, Railways may charge up to Rs 35 user fees, Rlys may charge up to Rs 35 user fees

రైలు ప్రయాణికులపై ఇకనుండి యూజర్‌ ఛార్జీలు భారం పడనుంది. ప్రయాణీకులు తమ టికెట్ ఛార్జీలతో పాటుగా అదనంగా రూ.10 నుంచి రూ.35 చెల్లించాల్సి ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్స్ లేదా అభివృద్ధి కోసం ఎంపిక చేసిన స్టేషన్ల లోనే ప్రయాణికుల నుండి ఈ యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. యూజర్ ఛార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలపై రైల్వే శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తిచేసింది. త్వరలోనే ఈ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ఆమోదానికి పంపించనున్నారు. రైల్వే లో టికెట్ తరగతుల వారీగా ప్రయాణికుల నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేసేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ముందుగా దేశవ్యాప్తంగా 700 కు పైగా స్టేషన్లలో యూజర్ ఛార్జీల వసూలు విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =