అక్టోబర్ 1 న పంటల కనీస గిట్టుబాటు ధరలపై ప్రకటన: సీఎం వైఎస్ జగన్

Andhra Pradesh, Andhra Pradesh Government, Andhra Pradesh government to announce MSP for crops, AP to announce MSP for Kharif crops, AP to announce MSP for Kharif crops on October 1, CM YS Jagan, CM YS Jagan says will Announce on Minimum Prices of Crops, Minimum Prices of Crops, MSP for crops, MSP for Kharif crops, MSP for Kharif crops in Ap, MSP for Khariff crops

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రైతులు పండించిన ఏ పంటకు ఎంత కనీస గిట్టుబాటు ధర ఇస్తామనేది అక్టోబర్‌ 1వ తేదీన ప్రకటించబోతున్నట్లు తెలిపారు. ప్రకటించిన కనీస గిట్టుబాటు ధరలతో కూడిన పోస్టర్‌ను అక్టోబర్‌ 5వ తేదీ కల్లా రాష్ట్రంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకేలు) వద్ద ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ప్రకటించిన ధరల కంటే కూడా రైతులకు ఎక్కువే వచ్చేలా అధికారులు చూడాలన్నారు. అలా జరగని పక్షంలో మార్కెట్‌ జోక్యంతో రైతులకు మేలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఖరీఫ్‌ పంట చేతికి వస్తుండడంతో, ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలు కానుందని, ఈ ప్రక్రియలో రైతు భరోసా కేంద్రాలు ప్రధాన పాత్ర పోషించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =