వైట్ హౌజ్ భారీ స్థాయిలో దీపావళి వేడుకలు, పాల్గొన్న అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్

US President Joe Biden Hosted Diwali Reception at the White House on a Large Scale, US President Joe Biden, US Vice President Kamala Harris, US President Joe Biden Hosted Diwali Reception, Mango News,Mango News Telugu, Diwali Reception at the White House, White House Diwali Celebration, US White House, US White House Latest News And Updates, US White House Diwali Celebration, USA Diwali Celebration, Diwali Celebration USA Live News And Updates

అమెరికా అధ్యక్షుడు అధికారిక నివాస భవనమైన వైట్ హౌజ్ లో సోమవారం దీపావళి వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ వైట్ హౌజ్ లో దీపావళి రిసెప్షన్ ఏర్పాటు చేసి, అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ఈ వేడుకలకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సహా 200 మందికి పైగా ప్రముఖ ఇండియన్ అమెరికన్లు హాజరయ్యారు. జార్జ్ బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి దీపావళి పండుగను వైట్ హౌజ్ లో జరుపుకుంటునప్పటికీ, ఈ స్థాయిలో వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటుగా, భారతీయ వంటకాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్ ట్వీట్ చేస్తూ “ఈ దీపావళి సందర్భంగా చీకటి నుండి కాంతిని సేకరించడంలో శక్తి ఉందని మనం గుర్తుంచుకోవచ్చు. అమెరికన్ కథ మనలో ఎవరిపైనా ఆధారపడి ఉండదు, కానీ మనందరిపై ఆధారపడి ఉంటుంది. ఈ దీపాల పండుగ జరుపుకునే మరియు ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యే వారికి ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు. చీకటిని పారద్రోలి ప్రపంచానికి వెలుగునిచ్చే శక్తి మనలో ప్రతి ఒక్కరికీ ఉందని దీపావళి గుర్తుచేస్తుంది. ఈరోజు వైట్‌ హౌజ్ లో ఈ సంతోషకరమైన సందర్భాన్ని జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. అలాగే అమెరికా అంతటా ఉన్న అద్భుతమైన దక్షిణాసియా సమాజం కరోనా మహమ్మారి నుండి దేశం బలంగా బయటపడటానికి సహాయపడిందని జో బైడెన్ అన్నారు.

ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ట్వీట్ చేస్తూ, “యునైటెడ్ స్టేట్స్ మరియు ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ, దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే ఆశల పర్వదినం. ఈ రాత్రి, మేము చెడుపై మంచి కోసం, అజ్ఞానంపై జ్ఞానం కోసం మరియు చీకటిపై వెలుగు కోసం పోరాటాన్ని జరుపుకుంటాము” అని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − 8 =