కాంగ్రెస్ దయతో ఎదిగినవారే వెన్నుపోటు పొడుస్తున్నారు, కార్యకర్తలందరూ ఏకమవ్వాలి – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Munugode By-poll TPCC Chief Revanth Reddy Calls Congress Party Cadre To Unite Against Traitors, Munugode By-poll TPCC Chief Revanth Reddy, TPCC Chief Revanth Reddy, Revanth Reddy Calls Congress Party Cadre, Mango News,Mango News Telugu, Congress Party Cadre To Unite Against Traitors, TRS Party, Munugode By-Poll, TRS Party Munugode By-Poll, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడు ఉప ఎన్నికకు సమయం సమీపిస్తున్న కొద్దీ పార్టీల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ఒకవైపు అధికార టీఆర్ఎస్ మరియు బీజేపీలు ఎలాగైనా మునుగోడులో గెలవాలని జోరుగా ప్రచారం నిర్వహిస్తుండగా.. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే ఆ పార్టీ అంతర్గత కలహాలతో సతమతవుతోంది. ఇప్పటికే ఎంపీ కోమటిరెడ్డి వ్యవహారం పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ద్రోహులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏకం కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే తప్పా? అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.

కాంగ్రెస్ వేసిన భిక్షతో ఎదిగినవారే నేడు పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని, పార్టీని నాశనం చేయడానికి ప్రత్యర్థులతో చేతులు కలుపుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటివారి నుంచి కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాలంటే రాష్ట్రంలోని నిఖార్సైన కార్యకర్తలందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, అందరూ మునుగోడుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిపై రాళ్లతో దాడులు చేస్తుంటే చూస్తూ ఉరుకుందామా? అని శ్రేణులను ప్రశ్నించారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీల ఆగడాలను ఎదుర్కోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి కార్యకర్తా తరలి రావాలని, మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని రేవంత్ రెడ్డి లేఖలో కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =