తెలంగాణ: కీసరలో జూన్ 1,2 తేదీలలో రాష్ట్రస్థాయి ‘చింతన్ శిబిర్’ నిర్వహిస్తాం – సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Telangana CLP Leader Bhatti Vikramarka Announces To Holds State Level Chintan Shivir on June 1st-2nd at Keesara, CLP Leader Bhatti Vikramarka Announces To Holds State Level Chintan Shivir on June 1st-2nd at Keesara, TS CLP Leader Bhatti Vikramarka Announces To Holds State Level Chintan Shivir on June 1st-2nd at Keesara, Bhatti Vikramarka Announces To Holds State Level Chintan Shivir on June 1st-2nd at Keesara, State Level Chintan Shivir on June 1st-2nd at Keesara, Chintan Shivir on June 1st-2nd at Keesara, State Level Chintan Shivir, Keesara, Chintan Shivir, Telangana CLP Leader Bhatti Vikramarka, TS CLP Leader Bhatti Vikramarka, CLP Leader Bhatti Vikramarka, Bhatti Vikramarka, Chintan Shivir News, Chintan Shivir Latest News, Chintan Shivir Latest Updates, Chintan Shivir Live Updates, Mango News, Mango News Telugu,

ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ‘నవ సంకల్ప్ శిబిర్‌’కు కొనసాగింపుగా.. జూన్ 1 మరియు 2 తేదీల్లో మేడ్చల్ జిల్లా కీసరలో కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి ‘చింతన్ శిబిర్’ను నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 33 మంది సభ్యులతో రాష్ట్ర స్థాయి ‘చింతన్ శిబిర్’ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రకటించారు.

ఈరోజు దీనిపై భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రెండు రోజులు జరిగే చింతన్ శిబిర్ కార్యక్రమంలో వివిధ అంశాలను చర్చించటానికి 6 గ్రూపులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చర్చించిన పలు అంశాలపై రాజకీయ వ్యహారాలు కమిటీలో కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం మరియు ఉదయ్‌పూర్ నవ సంకల్ప్ ప్రకటనను తెలంగాణ వ్యాప్తంగా జిల్లా మరియు మండల స్థాయిలకు తీసుకెళ్లడంపై ‘చింతన్ శిబిర్’ నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు.

ఈ రాష్ట్ర స్థాయి కార్యక్రమం ద్వారా రాబోయే 90 నుండి 180 రోజుల్లో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పంచాయితీ, మండల, జిల్లాస్థాయి స్థానాలను భర్తీ చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన పలువురు బలిదానాలు చేసుకుంటుంటే చూడలేక, 4 కోట్ల ప్రజల ఆకాంక్షను గుర్తించి ఆనాడు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ను రాష్ట్రమంతటా అన్ని పల్లెల్లో ప్రచారం నిర్వహిస్తామని కూడా భట్టి విక్రమార్క తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here