ఐసీఐసీఐ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం.. వీడియోకాన్‌ సీఈవో వేణుగోపాల్‌ ధూత్‌ని అరెస్ట్‌ చేసిన సీబీఐ

Videocon CEO Venugopal Dhoot Arrested By CBI Today in ICICI Bank Money Laundering Case,CBI Arrests Videocon CEO,Videocon CEO Venugopal Dhoot,ICICI Bank Quid Proco Case,Mango News,Mango News Telugu,Venugopal Dhoot Arrested,Venugopal Dhoot Arrest,Venugopal Dhoot Arrest Latest News and Updates,Videocon loan fraud case,ICICI Bank loan fraud case,CBI arrests Videocon Chairman,Quid pro quo in ICICI Bank issue,ICICI Bank Videocon loan case,Videocon loan case,ICICI Bank Quiz,Quid Pro Quo Case Law,ICICI Bank Provogue Offer,ICICI Bank Indigo Promo Code,ICICI Bank Procurement Department,ICICI Bank Procurement Head,ICICI Provogue Bag

ఐసీఐసీఐ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈవో చందా కొచర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌లను అరెస్ట్ చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మరింత దూకుడు పెంచింది. తాజాగా వీడియోకాన్ గ్రూప్ సీఈవో వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. దర్యాప్తులో భాగంగా.. వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసీఐసీఐ బ్యాంక్ మంజూరు చేసిన రూ.3,000 కోట్లకు పైగా రుణంలో అవకతవకలకు సంబంధించి ఆధారాలు లభించడంతో ఆయనను సోమవారం అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 20 బ్యాంకుల కన్సార్టియం నుండి వీడియోకాన్ పొందిన మొత్తం రూ.40,000 కోట్ల రుణంలో ఇది భాగం కావడం గమనార్హం.

2019లోని అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం.. నేరపూరిత కుట్రకు సంబంధించిన ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్న నూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్‌ఆర్‌ఎల్) కంపెనీలతో పాటు చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్, ధూత్‌లను సీబీఐ నిందితులుగా పేర్కొంది. కాగా వీడియోకాన్ గ్రూప్‌కు 2010 మరియు 2012 మధ్య బ్యాంకు రుణం మంజూరు చేసిన కొన్ని రోజుల తర్వాత, వేణుగోపాల్ ధూత్ న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో రూ.64 కోట్లు పెట్టుబడి పెట్టారని సీబీఐ ఆరోపించింది. ఇది ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం క్విడ్ ప్రోకోలో భాగంగా జరిగిందని సీబీఐ వెల్లడించింది. కొచ్చర్ సభ్యులుగా ఉన్న కమిటీ ఈ రుణాన్ని క్లియర్ చేసిందని, ఆమె తన అధికారాన్ని ఉపయోగించి పదవీ దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =