20 మంది మెట్రోరైల్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్

20 Delhi Metro Staff Test Positive, 20 Delhi Metro Staff Test Positive For COVID-19, Delhi, delhi coronavirus, Delhi Coronavirus Updates, Delhi Covid 19, Delhi Covid 19 News, Delhi Covid 19 Updates, Delhi Metro Staff, Delhi Metro Staff COVID-19, Delhi Metro Staff Test Positive

దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల తర్వాత ఢిల్లీలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఢిల్లీలో ఇప్పటికే 25,004 కరోనా కేసులు నమోదవగా, 9898 మంది కోలుకున్నారు, 659 మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రోరైలు కార్పోరేషన్‌లో పనిచేసే 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పోరేషన్‌ (డీఎంఆర్‌సీ) ట్వీట్ చేసింది. ఢిల్లీ మెట్రోలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వైరస్ సోకిందని పేర్కొంది. కాగా సిబ్బంది ఆరోగ్యం నిలకడగా ఉందని, వారంతా కోలుకుంటున్నారని మెట్రో అధికారులు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − five =