వాట్సాప్‌లో అందుబాటులోకి రానున్న 5 సరికొత్త ఫీచర్లు

5 New Features In WhatsApp, WhatsApp, WhatsApp 5 New Features, WhatsApp Latest News, WhatsApp Release 5 New Features, WhatsApp Updates, WhatsApp will Release 5 New Features, WhatsApp will Release 5 New Features Soon

వాట్సాప్ త్వరలో 5 సరికొత్త ఫీచర్స్ ను ప్రవేశపెట్టబోతుంది. యానిమేటెడ్‌ స్టిక్కర్లు, క్యూఆర్‌ కోడ్స్‌, డెస్క్ టాప్​ వాట్సాప్​కు డార్క్ మోడ్​, క్వాలిటీ వీడియో కాల్స్​, కాయ్‌ ఓఎస్‌కు స్టేటస్‌ ఫీచర్‌ అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త ఫీచర్స్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్స్ లో మరి కొద్దీ రోజుల్లోనే అప్ డేట్ కానున్నాయి.

యానిమేటెడ్​ స్టిక్కర్స్​: చాటింగ్​ను మరింత ఆహ్లాదంగా మార్చే యానిమేటెడ్​ స్టిక్కర్స్​ను వాట్సాప్​ కొత్త వెర్షన్స్ లో అందుబాటులోకి తీసుకురానుంది.

క్యూఆర్​ కోడ్: మొబైల్​ నంబర్​ అవసరం లేకుండా క్యూఆర్​ కోడ్​తో వారి కోడ్ ను స్కాన్ చేసి కాంటాక్ట్స్ లో యాడ్ చేసుకోవచ్చు.

డెస్క్ టాప్ వాట్సాప్ లో డార్క్​మోడ్​: ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ల యాప్స్ లో​ డార్క్ మోడ్​ ఇప్పటికే అందుబాటులో ఉండగా, డెస్క్ టాప్ మోడ్ లో కూడా ఇకపై ఈ ఫీచర్ యాడ్ కానుంది.

వీడియో క్వాలిటీ: వీడియో కాలింగ్ లో ఎనిమిది మంది పాల్గొనేలా ఇటీవలే మార్పు చేసిన సంగతి తెలిసిందే. అలాగే కాల్ క్వాలిటీలో మార్పులు చేర్పులు చేయనున్నారు.

స్టేటస్​: జియో ఫోన్ లో ఉండే కాయ్‌ ఓఎస్‌ లో స్టేటస్ ఫీచర్ తీసుకురానున్నారు.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + nine =