మంకీపాక్స్‌పై ప్రపంచదేశాలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో

WHO Warns Monkeypox Spreads in 23 Countries and Poses Moderate Risk To Public Health, Monkeypox Spreads in 23 Countries and Poses Moderate Risk To Public Health, WHO Warns Monkeypox Spreads in 23 Countries, Poses Moderate Risk To Public Health, Monkeypox confirmed in 23 nations, Poses moderate Risk, Monkeypox spreads to 23 countries, total 257 Monkeypox confirmed cases, World Health Organization, Public Health, World Health Organization Warns Monkeypox Spreads in 23 Countries, World Health Organization Warns 23 Countries, 23 Countries, Monkeypox News, Monkeypox Latest News, Monkeypox Latest Updates, Monkeypox Live Updates, Mango News, Mango News Telugu,

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మంకీపాక్స్‌ వ్యాధిపై ప్రపంచదేశాలకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ప్రపంచవ్యాప‍్తంగా మంకీపాక్స్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ప్రజారోగ్యానికి మంకీపాక్స్‌ ముప్పు పొంచి ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న మంకీపాక్స్ వ్యాప్తి ప్రపంచ ప్రజారోగ్యానికి ఒక మోస్తరు ప్రమాదాన్ని కలిగిస్తుందనిహెచ్చరించింది. మే 26 నాటికి మొత్తం 23 దేశాలలో మొత్తం 257 కేసులు నమోదయ్యాయని, దాదాపు మరో 120 అనుమానిత కేసులు దర్యాప్తులో ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, వెంటనే వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని సూచించింది.

మంకీపాక్స్‌పై ప్రజలందరికీ అవగాహన కల్పించాలని, వ్యాధి లక్షణాలను తెలియజేయాలని కోరింది. ఒకవేళ వైరస్ తీవ్రరూపం దాల్చితే చిన్నారులు, రోగ నిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై అధిక ప్రభావం పడుతుందని హెచ్చరించింది. మరోవైపు మంకీ పాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కేంద్ర అధికారుల సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు డీహెచ్ శ్రీనివాసరావు. జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం మంకీ పాక్స్ లక్షణాలని ఆయన తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =