భారత్-ఇంగ్లండ్ మధ్య నేడు రెండో టీ20.. బరిలోకి దిగనున్న విరాట్ కోహ్లీ, రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం!

India vs England 2nd T20 Virat Kohli Likely To Open Innings with Rohit Sharma, Virat Kohli Likely To Open Innings with Rohit Sharma, Virat Kohli's Big Test today, Virat Kohli And Rohit Sharma compete for unprecedented feat in India vs England 2nd T20, India vs England 2nd T20 Live Score, England win toss, England opt to bowl, India vs England 2nd T20I, Virat Kohli Open Inning With Rohit Sharma In India vs England 2nd T20I, Rohit Sharma, Virat Kohli, India vs England, Virat Kohli likely open the innings with Rohit Sharma in the 2nd T20I, India vs England 2nd T20I News, India vs England 2nd T20I Latest News, India vs England 2nd T20I Latest Updates, India vs England 2nd T20I Live Updates, Mango News, Mango News Telugu,

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కీలకమైన రెండో మ్యాచ్‌ నేడు జరుగనుంది. బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. కెప్టెన్ రోహిత్‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. ఎందుకంటే తొలి మ్యాచ్‌లో మూడో స్థానంలో ఆడిన దీపక్ హుడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో కూడా అతడిని అదే స్థానంలో ఆడించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం మెండుగా ఉంది. ఇక ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే.

ఈ విజయం ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో వరుసగా 13 టీ20 మ్యాచ్‌లను గెలిచిన మొదటి కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. సౌతాంప్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనతో టీమిండియా 50 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించింది. ఇదే ఊపును కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని ఇండియా భావిస్తోంది. మరోవైపు పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమి పాలవడం ఆ జట్టుని షాక్ కి గురి చేసింది. ఈ క్రమంలో నేటి మ్యాచ్ గెలవడం ద్వారా సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కావడంతో హోరాహోరీగా సాగనుంది. భారత కాలమాన ప్రకారం ఈరోజు రాత్రి 7:30కి మ్యాచ్ జరుగనుండగా, మరికొన్ని గంటల్లో ఫలితం తేలనుంది.

తుది జట్ల అంచనా!

ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, దీపక్‌ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్.

ఇంగ్లండ్‌: బట్లర్‌ (కెప్టెన్‌), జాసన్ రాయ్, డేవిడ్ మలన్, మోయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టోప్లీ, మాథ్యూ పార్కిన్సన్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × three =