భయపెడుతున్న జెఎన్ 1

Work from home again Frightening JN 1,Work from home again,again Frightening JN 1,Work from home again, Frightening JN 1,JN 1,It Company, Wipro,Mango News,Mango News Telugu,As Covid scare returns,My Biggest Fear About Working from Home,Frightening JN 1 Latest News,Frightening JN 1 Latest Updates,Coronavirus,Coronavirus Latest News,Coronavirus Latest Updates
Work from home again, Frightening JN 1,JN 1,It Company, Wipro

కొన్నాళ్లుగా కరోనా మహమ్మారి శాంతించడంతో కంపెనీలు ఒక్కటొక్కటీ తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిపించుకుని పని చేయించుకుంటున్నాయి. మరి కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానంతో పని చేయించుకుంటున్నాయి. ఇక రేపో మాపో దానిని కూడా ఎత్తేసే ఆలోచనలో ఉన్నాయి.

సరిగ్గా ఇలాంటి సమయంలోనే డిసెంబర్ మొదటి వారం నుంచి జెఎన్ 1 వైరస్ ఉధృతి పెరుగుతూ  వస్తోంది.మొన్నటి వరకూ కేసులు పెరగడమే తప్ప..పెద్దగా భయపెట్టని వైరస్ ఇప్పుడు ప్రాణాలు కూడా తీస్తుందన్న లెక్కలు బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగానే కాదు..చివరకు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా జెఎన్1 మరణాలు నమోదయ్యాయి. దీంతో డాక్టర్లు జాగ్రత్తలు తీసుకోవాలని  మాస్కు , వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాలను పాటించాలని చెబుతూ వస్తున్నారు.

మరోవైపు పెరుగుతున్న కేసులతో ఐటీ కంపెనీలు మళ్లీ తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్నే పాటించాలని ఆదేశించాలని కోరేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై ఐటీ కంపెనీలన్నీ త్వరలోనే  కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. కోవిడ్​ 19 నుంచి కోలుకున్న కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసు రావాలని ఇప్పటికే లెటర్స్​ పంపించాయి. ఈ లోగా జేఎన్ 1 వైరస్​ విజృభిస్తుండటంతో మళ్లీ వర్క్​ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జేఎన్ 1 వైరస్​ కరోనా దేశ వ్యాప్తంగా వ్యాపించడంతో..ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించినట్లు తెలుస్తోంది.అంతేకాదు ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో కూడా..తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ అని చెప్పేసింది. ఇప్పుడు హైబ్రిడ్‌ వర్క్‌ చేస్తున్న  తమ ఉద్యోగులందరినీ విప్రో అప్రమత్తం చేసింది. దేశంలో కొత్త కరోనా ​ జేవన్ 1 వైరస్​ కేసులు పెరిగిపోతుండటంతో.. ఉద్యోగులంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

తాము ఓ వైపు సంస్థ వృ‍ద్ది కోసం  పాటుపడతామని..అదేవిధంగా ఉద్యోగుల శ్రేయస్సుకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు విప్రో తెలిపింది. ప్రస్తుతం పూర్తిగా టీకాలు వేసుకున్న ఉద్యోగులంతా వారానికి మూడు రోజులు  ఆఫీసులకు వెళుతున్నారు. అయితే మరోసారి ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న జెఎన్ 1 వైరస్ వల్ల తమ ఉద్యోగులకు ఐటీ కంపెనీలు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఇవ్వక తప్పేటట్టు లేదు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 13 =