జనవరిలో వరుసగా చంద్రబాబు బహిరంగ సభలు

Chandrababus Public Meetings in January,Chandrababus Public Meetings,Public Meetings in January,TDP Public Meetings,Chandrababu naidu, TDP, AP Politics, AP Assembly elections,Chandrababu will start public meetings,TDP Public Meetings,Mango News,Mango News Telugu,Chandrababus Public Meetings News Today,Chandrababus Public Meetings Latest News,Chandrababus Public Meetings Latest Updates,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates
Chandrababu naidu, TDP, AP Politics, AP Assembly elections

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. తక్కవ సమయం ఉండడంతో ప్రధాని పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ యువగళం నవశకం భారీ బహిరంగ సభతో ఎన్నికల శంఖారావం పూరించింది. జోరుగా ముందుకెళ్తోంది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. జనసేనతో కలిసి వైసీపీని గద్దె దించేందుకు వ్యూహాలు రచిస్తోంది. త్వరలో అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.

ఇక కొత్త సంవత్సరంలో మరింత స్పీడ్ పెంచేందుకు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు పలు జిల్లాల్లో పర్యటించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జనవరిలో వరుసగా బహిరంగ సభలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో  బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు విడతలుగా ఈ సభలు నిర్వహించనుండగా.. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఖరారు చేశారు. జనవరి 5 నుంచి 29 వరకు సభలు నిర్వహించనున్నారు. నెలఖారు వరకు మొత్తం 25 బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

జనవరి 5 నుంచి 10 వరకు తొలి విడత సభలు నిర్వహించనుండగా.. సంక్రాంతి పండుగ తర్వాత రెండో విడత సభలు నిర్వహించనున్నారు. జనవరి 5న ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలోని కనిగిరిలో తొలి బహిరంగ సభను చంద్రబాబు నిర్వహించనున్నారు. అక్కడి నుంచి వరుస సభలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత ఆచంటల, తిరువూరు, వెంకటగిరి, పెద్దాపురం, టెక్కలితో పాటు మొత్తం 25 చోట్ల బహిరంగ సభలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు, మూడు సభల్లో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఈ సభల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కీలకంగా ఉన్న మూడు రీజియన్స్‌ని కవర్ చేయాలని చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =