ఆ పాలు తాగితే పవర్ ఫుల్ కిక్

Drinking Two Sips Of Elephant Milk Is More Intoxicating Than Alcohol,Drinking Two Sips Of Elephant Milk,More Intoxicating Than Alcohol,Elephant Milk Is More Intoxicating,Mango News,Mango News Telugu,Drinking That Milk, Powerful Kick,Elephant Milk, Alcohol, Elephant Milk Intoxicating Than Alcohol,Elephant Milk Latest News,Elephant Milk Latest Updates,Elephant Milk Live News

చిన్నపిల్లలే కాదు.. పెద్దవాళ్లు కూడా పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని పెద్దలే కాదు వైద్యులు కూడా చెబుతుంటారు. ఎందుకంటే పాలలో కాల్షియంతో పాటు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.అయితే కొంతమంది ఆవుపాలు , గేదేపాలు కానీ తాగుతారు. మరి కొందరు మేక పాలు కూడా తాగుతారు.అంతేకాదు మరికొంతమంది చిన్నపిల్లలలో జలుబు, దగ్గు తగ్గడానికి అని ఆరోగ్యానికి మంచివని గాడిదపాలు కూడా తాగుతారు.

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయన్న విషయం చిన్నప్పటి నుంచీ తెలిసిందే. వీటితో రోగ నిరోధక శక్తి మెరుగుపడటమే కాదు.. పాలు తాగటం వల్ల ఎముకలు, దంతాలు గట్టి పడతాయి. అంతే కాదు రాత్రి నిదురపోయే ముందు గోరువెచ్చని పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుందని పెద్దవాళ్లు తరచూ చెబుతుంటారు. అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా పాలు తాగి పడుకుంటారు. ఆవు పాలు, గేదెపాలు, మేకపాలు, చివరకు గాడిద పాలు తాగినా కూడా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితులలోనూ ఏనుగు పాలు తాగకూడదని వైద్యులు అంటున్నారు.

అవును ఏనుగు పాల గురించి వినడానికి షాక్‌గా ఉన్నా కూడా ఇదే నిజం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఏనుగు పాలు మాత్రం తాగకూడదంటున్నారు డాక్టర్లు.ఎందుకంటే..ఈ పాలలో ఎక్కువ శాతంలో ఆల్కహాల్ ఉంటుందట. ఏనుగు పాలు ఆల్కహాల్, బీర్ కంటే కూడా ఎక్కువ మత్తు ప్రభావాన్ని కలిగి ఉంటాయట.అవును ఏనుగు పాలలో 60 శాతం వరకూ ఆల్కహాల్ ఉంటుందట.

ఏనుగు పాల గురించి పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం.. ఏనుగులు చెరకును తినడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. చెరకులో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ ఏర్పడే పదార్థాలు ఉంటాయన్న విషయం తెలిసిందే.ఏనుగు పాలలో ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండడానికి ఇదే కారణంగా పరిశోధకులు చెబుతున్నారు. అందుకే ఏనుగు పాలు మనుష్యులు తాగకూడదు అంటున్నారు డాక్టర్లు. ఏనుగు పాలలో ఉండే రసాయనాలు చాలా ప్రమాదకరమైనవి. అంతేకాదు ఏనుగు పాలలో బీటా కేసైన్‌తో పాటు ఎక్కువ మొత్తంలో లాక్టోస్ ఉంటుంది. డైరీ సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధనల ప్రకారం.. ఏనుగు పాలు ఇతర జంతువుల కంటే ఎక్కువ రసాయనాలను కలిగి ఉంటాయి. ఈ పాలలో ఒలిగోశాకరైడ్స్ అని పిలువబడే పెద్ద మొత్తంలో కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏనుగుల జాతులను చూసుకున్నట్లయితే.. మూడు రకాల ఏనుగులు ఉన్నాయి. ఆఫ్రికన్ సవన్నా ఎలిఫెంట్,ఆఫ్రికన్ ఫారెస్ట్ ఏనుగుతో పాటు ఆసియా ఏనుగు ఉన్నాయి. ఇందులో ఆఫ్రికన్ ఆడ ఏనుగు పాలలోనే ఇప్పుడు ఎక్కువ స్థాయిలో లాక్టోస్, ఒలిగోశాకరైడ్లు ఉన్నట్లు తేలింది. ఏనుగు పాలు పొరపాటున మనుష్యులు ఎవరైనా ఎప్పుడైనా తాగితే.. శరీరం గాల్లో తేలిపోవడంతో పాటు శరీరం మొత్తం మన అధీనం కోల్పోయి చాలా మార్పులు జరుగుతాయని డాక్టర్లు అంటున్నారు. అంతెందుకు ఏనుగు పాలు రెండు సిప్పులు తాగినా సరే వెంటనే వాళ్లు.. నిషాతో కింద పడిపోతారని చెబుతున్నారు. అంతేకాదు ఏనుగు పాలలో ఉండే ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్ వల్ల..ఈ పాలు తాగినవారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు ఎదురవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =