ఉద్యమ సమయంలోనే సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ రక్షణకు ఫెన్సింగ్‌

Fencing to Protect the CMs Camp Office During the Movement Itself,Fencing to Protect the CMs,CMs Camp Office During the Movement,During the Movement Itself,Remove the Fence, Fencing, Protect the CM's Camp Office, BRS, Congress,KCR,Mango News,Mango News Telugu,CM Camp Office Latest News,CM Camp Office Latest Updates,CM Camp Office Live News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News
remove the fence, Fencing, protect the CM's camp office, Brs, Congress,KCR

రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. ప్రగతిభవన్‌ ముందున్న కంచెను తొలగిస్తున్నామని.. ఇక నుంచి అది ప్రగతిభవన్‌ కాదని ప్రజాభవన్‌ అని ప్రకటించారు. నిజానికి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే తీసుకున్న నిర్ణయం సీఎం అధికారిక నివాసం ముందు ఫెన్సింగ్ తొలగించడం. దీంతో కంచెను తొలగిస్తున్న దృశ్యాలు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్ అవడంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చల సాగాయి.

ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన కంచెను కాంగ్రెస్ సర్కార్ తొలగిస్తుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం .. ప్రజల ప్రభుత్వమంటూ న్యూస్ వినిపిపించింది.  అయితే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వేసిన కంచెగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగిన సాక్ష్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వైరల్ చేస్తున్నారు.

తాజాగా సీఎం అధికారిక నివాసం అయిన ప్రగతిభవన్‌ ముందు కాంగ్రెస్‌ హయాంలోనే కంచె మొలిచిందనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో.. ఉద్యమకారులు ఎన్నో ముట్టడి కార్యక్రమాలకు పిలుపు నివ్వటం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయ ముట్టడికి బయలుదేరినప్పుడల్లా చాలా సందర్భాల్లో వారికి అడ్డుగా ముళ్లకంచె ఎదురయ్యేది.

అనుమతిలేనిదే లోనికి వెళ్లకూడదు అన్న బోర్డులతో ఎక్కడికక్కడ ఉద్యమకారులు లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యేవి ఉండేవి. ఆ సమయంలో భారీ పోలీసు భద్రతా ఏర్పాట్ల దృశ్యాలు చాలా ఏర్పాటు చేసినట్లు వీడియాలు, ఫోటోలపై ఇప్పుడు మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి.  దీంతో ఈ ఫెన్సింగ్ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే  మొలిచిందంటూ కొన్ని పోస్టులు వైరల్‌ అయ్యాయి.

సీఎం అధికారిక నివాసంలోకి వెళ్లే ప్రతీ వెహికల్‌ను, అందులో ఉన్నవాళ్లను తనిఖీ చేసిన తర్వాతే.. వారిని లోపలికి పంపిస్తున్న వీడియో క్లిప్పులు మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీని ప్రకారం 2012 వ సంవత్సరంలో అవి  తీసినట్లుగా తెలుస్తోంది. అయితే తెలంగాణ  రాష్ట్ర సాధన తర్వాత ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని సుందరీకరించినప్పుడు ముందున్న ఫెన్సింగ్‌నే మరింత పటిష్టం చేశారు.

ఆ సమయంలోప్రగతిభవన్‌ను  రూ.36 కోట్లు పెట్టి కట్టించామని.. కేసీఆర్‌ తరువాత దాంట్లో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉంటారని కేసీఆర్ చెప్పిన వీడియో కూడా వైరల్ అవుతోంది. అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసమే కానీ.. కేసీఆర్‌ నివాసం కాదని అన్నారు. కేసీఆర్‌ సొంతభవనం కాదని తెలంగాణ ప్రజల ఆస్తి అంటూ అప్పట్లో కేసీఆర్ చెప్పిన వీడియోపైనా చర్చ సాగుతోంది. దీంతో వారే కంచె వేసి ఇప్పుడు వారే తీస్తున్నారు తప్ప..అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ కాదని తేలిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =