పద్మ అవార్డుల దరఖాస్తు గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు

Nominations for Padma Awards, Nominations for Padma Awards 2021, Online Nominations for Padma Awards, Online Nominations for Padma Awards 2021, Padma Awards, Padma Awards 2021, Padma Awards Online Nominations, Padma Bhushan Award, padma shri award, padma shri award 2021, PV Sindhu Recommended For Padma Bhushan Award

పద్మ అవార్డులకు సంబంధించి ఆన్‌లైన్ నామినేషన్లు/సిఫార్సుల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ‌ మే 1వ తేదీన మొద‌లైన సంగతి తెలిసిందే. తాజాగా పద్మ అవార్డుల కోసం దరఖాస్తు చేసే గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో పద్మ అవార్డ్స్ పోర్టల్ https://padmaawards.gov.in లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో ఇప్పటికే 8035 దరఖాస్తులు రాగా, 6361 దరఖాస్తుల పరిశీలన పూర్తి చేరినట్టు తెలిపారు. 1954 లో ప్రారంభించ‌బ‌డిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది.

దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలుగా పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పుర‌స్కారాలు అందిస్తున్నారు. క‌ళ‌లు, సాహిత్యం, విద్య‌, క్రీడ‌లు, వైద్యం, సామాజిక సేవ‌, సాంకేతిక మరియు ఇంజినీరింగ్, ప్ర‌జా వ్య‌వ‌హారాలు‌, ప్ర‌జాసేవ, వాణిజ్యం మరియు పరిశ్రమ మొదలైన రంగాలు లేదా విభాగాలలో విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందిస్తారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 7 =